క్రీడాభూమి

కోహ్లీ సేన దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: ఈ ఏడాది ప్రారంభంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగడంతో, అన్ని ఫార్మాట్స్‌కూ పూర్తికాల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లీ మంచి ఫలితాలను రాణిస్తున్నాడు. అతని మార్గదర్శకంలో టీమిండియా దూడుకుగా ముందుకు దూసుకెళుతున్నది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ తొలి వనే్డ సిరీస్ విజయాన్ని ఇంగ్లాండ్‌పై నమోదు చేసింది. ఆ జట్టును 2-1 తేడాతో ఓడించి సత్తా చాటింది. ఆతర్వాత టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను కూడా అదే తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వరకూ చేరి, రన్నరప్ ట్రోఫీని అందుకుంది. అనంతరం ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో చిత్తుచేసింది. ఆ వెంటనే వెస్టిండీస్, శ్రీలంక టూర్‌కు వెళ్లి విజయాలను నమోదు చేసింది. శ్రీలంకను శ్రీలంకలోనే వైట్‌వాష్ వేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను వనే్డ సిరీస్‌లో 4-1 తేడాతో ఓడించింది. టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో, ఒక గొప్ప పోరాటాన్ని చూసే అవకాశాన్ని అభిమానులు కోల్పోయారు. మొత్తం మీద వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న కోహ్లీ సేన ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే వనే్డ, టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లోనూ విజయభేరి మోగించాలన్న పట్టుదలతో ఉంది.