క్రీడాభూమి

భారత్‌కే టి-20 వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే సత్తా భారత్‌కే ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్, స్పిన్నర్ మొయిన్ అలీ జోస్యం చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని అన్నారు. స్వదేశంలో టోర్నీ జరగడం కూడా ఆ జట్టుకు లాభించే అంశమని పేర్కొన్నారు. అయితే, దాదాపు అన్ని జట్లూ బలమైనవే కాబట్టి ఈ టోర్నీలో పోరు ఉత్కంఠ భరితంగా సాగుతుందని అన్నారు. తమ జట్టు ఆటగాళ్లపై తనకు ఎలాంటి అనుమానం లేదని స్టోక్స్ చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తుది వరకూ పోరాడతామని అన్నాడు. అన్ని విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది కాబట్టే విజయాలపై నమ్మకం ఉందని తెలిపాడు. రెండు పర్యాయాలు 350కి పైగా పరుగులు సాధించామని, దాదాపు అలాంటి భారీ లక్ష్యానే్న ఒకసారి ఛేదించామని స్టోక్స్ అన్నాడు. కాబట్టి టి-20 వరల్డ్ కప్‌లోనూ రాణించగలమన్న నమ్మకం తనకు ఉందని తెలిపాడు.
సరైన దిశలో బంతులు వేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని మోయిన్ అలీ అన్నాడు. వికెట్లు పడగొట్టడం కంటే, ఎక్కువ పరుగులు చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను నియంత్రీకరించడమే టి-20 ఫార్మెట్‌లో కీలకమని చెప్పాడు. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని, దీనిని తాను సద్వినియోగం చేసుకుంటానని మోయిన్ అన్నాడు.
పోరు తీవ్రం: మోర్గాన్
టి-20 వరల్డ్ కప్‌లో పోరు తీవ్రంగా ఉంటుందని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో అనుమానం లేదన్నాడు. అయితే, మిగతా జట్లను తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. దాదాపుగా అన్నీ బలమైన జట్లేనని, దీనితో పోరు ఉత్కంఠ భరితంగా సాగుతుందని అన్నాడు.

విలేఖరుల సమావేశానికి వస్తున్న
స్టోక్స్ (ఎడమ), మొయిన్ (కుడి)