క్రీడాభూమి

కోహ్లీ మళ్లీ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 30: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ పురుషులు, మహిళల బ్యాటింగ్ విభాగాల్లో భారత జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ఇటీవలే రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ తిరిగి నంబర్ వన్‌గా ఎదిగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వనే్డలో సెంచరీ సాధించిన అతను ఇప్పుడు 889 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఎబి డివిలియర్స్, డేవిడ్ వార్నర్ వరుసగా రెండు, మూడు స్థానాలను సంపాదించారు. మహిళల వనే్డ బ్యాటింగ్ విభాగంలో మిథాలీ రాజ్ నంబర్ వన్‌గా నిలిచింది. ఎలిస్ పెర్రీ, అమీ సాటర్త్‌వైట్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా, వనే్డ సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకోవడంలో మరో సెంచరీ హీరో రోహిత్ శర్మతో కలిసి కోస్లీ కీలక భూమిక పోషించాడు. వరుసగా ఏడో సిరీస్‌ను సాధించడం విశేషం. భారత కెప్టెన్లలో మరెవరూ ఈ స్థాయిలో వరుస సిరీస్‌లను అందించలేదు. మొత్తం మీద 2016 జూన్ నుంచి మొదలైన అతని కెప్టెన్సీ జైత్రయాత్ర ఇంకా కొనసాగతునే ఉంది. 1988 నుంచి ప్రారంభమై ఇంత వరకూ స్వదేశంలో జరిగిన ఒక్క సిరీస్‌ను కూడా టీమిండియా ఓడిపోలేదు. కోహ్లీ అదే ఒరవడిని కొనసాగించాడు. అతను 43 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా, 33 విజయాలు సాధించాడు. కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోగా, ఒక మ్యాచ్ రద్దయింది. కెప్టెన్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లీ దక్కించుకున్నాడు. ఈ ఏడాది అతను 26 మ్యాచ్‌ల్లో 1,460 పరుగులు చేశాడు. 2007లో ఆస్ట్రేలియా సారథిగా రికీ పాంటింగ్ 1,424 పరుగులతో నెలకొల్పిన రికార్డును కోహ్లీ బద్దలు చేశాడు. పాంటింగ్ 27 మ్యాచ్‌ల్లో ఈ పరుగులు సాధించగా, కోహ్లీ 26 మ్యాచ్‌ల్లోనే అతని కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. తాజా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అతను తన వనే్డ కెరీర్‌లో ఐదోసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. భారత క్రికెటర్లలో కివీస్‌పై వీరేందర్ సెవాగ్ ఆరు శతకాలు చేయగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా టీమిండియాకు ఉత్తమ సేవలు అందిస్తున్న కోహ్లీ తన స్థాయికి తగినట్టుగానే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు.
తిరుగులేని హైదరాబాదీ
హైదరాబాదీ మిథాలీ రాజ్ మహిళల వనే్డల్లో తనకు తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్‌లోనూ అద్వితీయ ప్రతిభ కనబరచింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెట్‌కు గుర్తింపు ఇవ్వాలని, సిరీస్‌లు, టోర్నీలు విస్తారంగా జరగాలని డిమాండ్ చేస్తున్న మిథాలీ మహిళల వనే్డ బ్యాటింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుంది.

చిత్రాలు..ఐసిసి ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన విరాట్ కోహ్లీ
*మహిళల వనే్డ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న మిథాలీ