క్రీడాభూమి

పద్మశ్రీ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గుంటూరుకు చెందిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పేరును పద్మశ్రీ అవార్డుకు పరిశీలించాల్సిందిగా కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి విజయ్ గోయల్ కోరారు. అతని పేరును ప్రతిపాదిస్తున్నానని, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15. సుమారు నెలన్నర ఆలస్యంగా శ్రీకాంత్ పేరును గోయల్ ప్రతిపాదించడం ఆసక్తిని రేపుతున్నది. అవార్డుల కమిటీ ఈ ప్రతిపాదనపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ ఏడాది అద్భుత విజయాలతో దూసుకెళుతున్న శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10’లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఒకే క్యాలండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టోర్నమెంట్స్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ మరో ముగ్గురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించగలిగారు. రెండు వారాల వ్యవధిలో రెండు డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెల్చుకొని సత్తా చాటిన శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ, దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్న అతనికి పద్మశ్రీ దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు. తన అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా కోరారు.