క్రీడాభూమి

గుడ్‌బై నెహ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: టీమిండియాకు విశిష్ట సేవలు అందించిన పేసర్.. అందునా స్థానికుడు.. హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లాలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌తో తన కెరీర్‌ను ముగించిన ఆశిష్ నెహ్రాకు వేలాది మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. 38 సంవత్సరాల 186 రోజుల వయసులోనూ ఎంతో హుషారుగా మైదానంలో కనిపించిన నెహ్రా కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ఇది వరకే ప్రకటించడంతో, కేవలం అతనిని చివరిసారి మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో వనే్డ, టి-20 సిరీస్‌లకు ప్రకటించిన జట్లలో వాస్తవానికి నెహ్రా లేడు. అయితే, హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో, కివీస్‌తో జరిగే మొదటి టి-20 మ్యాచ్ సందర్భంలో కెరీర్‌ను ముగిస్తానని అతను ప్రకటించడంతో, సెలక్టర్లు సానుకూలంగా స్పందించారు. మొదటి టి-20 మ్యాచ్‌కి అతని పేరును చేర్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ కూడా అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలన్న ఉద్దేశంతో, ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకున్నారు. జాతీయ జట్టుకు సేవలు అందించనప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టోర్నీల్లో ఆడడంలో అర్థం లేదని పేర్కొంటూ, అన్ని రకాల క్రికెట్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించిన నెహ్రా తన నైతికతను చాటుకున్నాడు. అభిమానుల సంఖ్యను మరింతగా పెంచుకున్నాడు. అందుకే అతనికి ప్రేక్షకులు జేజేలు పలుకుతూ వీడ్కోలు చెప్పారు.

కెరీర్ గణాంకాలు..

శ్రీలంకతో, కొలంబోలో 1999 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన టెస్టుతో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన నెహ్రా వనే్డల్లో ఆడడానికి సుమారు రెండేళ్ల సమయం పట్టింది. 2001 జూన్ 24న హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా అతను వనే్డల్లో అరంగేట్రం చేశాడు. టి-20 ఫార్మాట్‌కు వచ్చేందుకు మరో ఎనిమిదేళ్లు పట్టింది. 2009 డిసెంబర్ 9న నాగపూర్‌లో శ్రీలంకపై అతను మొదటి టి-20 ఇంటర్నేషనల్ ఆడాడు. మొత్తం మీద కెరీర్‌లో 17 టెస్టులు ఆడిన అతను 25 ఇన్నింగ్స్‌లో 77 పరుగులు చేశాడు. 11 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 19 పరుగులు అతని అత్యధిక స్కోరు. 29 ఇన్నింగ్స్‌లో 3,447 బంతులు వేసిన అతను 1,866 పరుగులిచ్చి 44 వికెట్లు సాధించాడు. 72 పరుగులకు నాలుగు వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. అదే విధంగా 120 వనే్డలు ఆడినప్పటికీ, అతనికి 46 ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. 21 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, 141 పరుగులు చేశాడు. 24 పరుగులు అతని బెస్ట్ స్కోరు. ఈ ఫార్మాట్‌లో ఆడిన 120 ఇన్నింగ్స్‌లోనూ అతను బౌల్ చేశాడు. 5,751 బంతులు వేసి, 4,981 పరుగులిచ్చి 157 వికెట్లు పడగొట్టాడు. 23 పరుగులకు ఆరు వికెట్లు అతని టాప్ బౌలింగ్. బుధవారం నాటి మ్యాచ్‌తో కలిసి అతను మొత్తం 27 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఐదు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి, 28 పరుగులు సాధించాడు. 22 పరుగులు అతని అత్యధిక స్కోరు. కాగా, 27 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన అతను 588 బంతులు వేసి, 758 పరుగులిచ్చి 34 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 19 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌల్ చేసి, 29 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.