క్రీడాభూమి

కివీస్‌పై మొదటి టి-20లో ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరుసగా 11 టి-20 ఇంటర్నేషనల్స్‌లో మొదటి వికెట్‌కు కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించడం ద్వారా వారు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇద్దరూ అర్ధ శతకాలు సాధించి, టీమిండియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌ను 53 పరుగుల తేడాతో ఓడించిన భారత్, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును సాధించగా, అందుకు సమాధానంగా న్యూజిలాండ్ 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అర్ధ శతకాలతో రాణించగా, బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ చెరి రెండు వికెట్లు పడగొట్టి, భారత్ విజయాన్ని సులభతరం చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ బౌలింగ్ ఎంచుకోవడం పొరపాటు నిర్ణయమని భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నిరూపించారు. కివీస్ బౌలింగ్‌ను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా వారు స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మొదటి వికెట్‌కు 158 పరుగులు జత కలిసిన తర్వాత ఇష్ సోధీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్ క్యాచ్ అందుకోగా ఔటైన ధావన్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అతని స్కోరులో పది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అదే ఓవర్‌లో హార్దిక్ పాండ్య కూడా వెనుదిరిగాడు. లాథమ్‌కు క్యాచ్ ఇచ్చిన అతను పరుగుల ఖాతాను తెరవలేదు. కాగా, 55 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు సాధించిన రోహిత్ క్యాచ్‌ని కూడా లాథమ్ పట్టడం విశేషం. ఈ వికెట్ ట్రెంట్ బౌల్ట్‌కు దక్కింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ (26 నాటౌట్), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (7 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్తపడ్డారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు సాధించగా, కివీస్ బౌలర్లలో సోధీకి రెండు వికెట్లు లభించాయి. బౌల్ట్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఓపెనర్లు విఫలం

భారత్‌ను ఓడించి, టి-20 సిరీస్‌లో శుభారంభం చేసే బాధ్యతను స్వీకరించాల్సిన న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో దారుణంగా విఫలమయ్యారు. నాలుగు పరుగులు చేసిన గుప్టిల్‌ను హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా యుజువేంద్ర చాహల్ పెవిలియన్‌కు పంపాడు. మున్రో (7)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ కొంత సేపు జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. అయితే, 24 బంతుల్లో ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 28 పరుగులు చేసిన విలియమ్‌సన్‌ను ధోనీ క్యాచ్ అందుకోగా హార్దిక్ పాండ్య ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. టామ్ బ్రూస్ 10 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. అదే ఓవర్‌లో మరో వికెట్ కూలింది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సున్నాకే శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. హెన్రీ నికోల్స్ ఆరు పరుగులు చేసిన తర్వాత దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. చివరిలో మిచెల్ సాంట్నర్ (27 నాటౌట్), ఇష్ సోధీ (11 నాటౌట్) వికెట్ కూలకుండా అడ్డుకోగలిగారుగానీ, జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లకు 149 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.

స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్:
రోహిత్ శర్మ సి టామ్ లాథమ్ బి ట్రెంట్ బౌల్ట్ 80,
శిఖర్ ధావన్ సి టామ్ లాథమ్ బి ఇష్ సోధీ 80,
హార్దిక్ పాండ్య సి టామ్ లాథమ్ బి ఇష్ సోధీ 0,
విరాట్ కోహ్లీ 26 నాటౌట్,
మహేంద్ర సింగ్ ధోనీ 7 నాటౌట్,
ఎక్‌స్ట్రాలు 9,
మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 202.

వికెట్ల పతనం:

1-158, 2-158, 3-185.

బౌలింగ్:
మిచెల్ సాంట్నర్ 4-0-30-0,
ట్రెంట్ బౌల్ట్ 4-0-49-1,
టిమ్ సౌథీ 4-0-44-0,
కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 3-0-34-0,
ఇష్ సోధీ 4-0-25-2,
కొలిన్ మున్రో 1-0-14-0.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్:

మార్టిన్ గుప్టిల్ సి హార్దిక్ పాండ్య బి యుజువేంద్ర చాహల్ 4,
కొలిన్ మున్రో బి భువనేశ్వర్ కుమార్ 7,
కేన్ విలియమ్‌సన్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 28,
టామ్ లాథమ్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 39,
టామ్ బ్రూస్ సి రోహిత్ శర్మ బి అక్షర్ పటేల్ 10,
కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సి శిఖర్ ధావన్ బి అక్షర్ పటేల్ 0,
హెన్రీ నికోల్స్ రనౌట్ 6,
టిమ్ సౌథీ సి ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 8,
మిచెల్ సాంట్నర్ 27 నాటౌట్,
ఇష్ సోధీ 11 నాటౌట్,
ఎక్‌స్ట్రాలు 9,
మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.

వికెట్ల పతనం:

1-6, 2-8, 3-54, 4-83, 5-84, 6-94, 7-99, 8-111.

బౌలింగ్:

ఆశిష్ నెహ్రా 4-0-29-0,
యుజువేంద్ర చాహల్ 4-0-26-2
, భువనేశ్వర్ కుమార్ 3-0-23-1,
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-37-1,
అక్షర్ పటేల్ 4-0-20-2,
హార్దిక్ పాండ్య 1-0-11-1.