క్రీడాభూమి

లెకోవ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, నవంబర్ 2: రష్యా అథ్లెట్లపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతునే ఉంది. వ్యూహాత్మక డోపింగ్‌కు రష్యా ప్రభుత్వమే ప్రోత్సహించిందన్న వామర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో ఒలింపిక్ పతకాలు సాధించిన ఎంతో మంది రష్యా అథ్లెట్లు తాజాగా డోపింగ్ పరీక్షలో పట్టుబడుతూ, సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆ జాబితాలో మరో అథ్లెట్ చేరాడు. 2014లో జరిగిన సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన క్రాస్ కంట్రీ స్కీయర్ అలెగ్జాండర్ లెకోవ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలు వినియోగించాడని స్పష్టం కావడంతో, అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ప్రకటించింది. అతని పేరిట ఉన్న అన్ని రికార్డులను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో లెకోవ్ మరే ఇతర ఒలింపిక్స్‌కుగానీ, అంతర్జాతీయ ఈవెంట్స్‌కుగానీ హాజరుకారాదని ఆ ప్రకటనలో పేర్కొంది. సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా తరఫున పోటీపడిన ఇంకా 27 మంది డోప్ పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వివరించింది. దీనితో డోప్ దోషులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిత్రం..అలెగ్జాండర్ లెకోవ్