క్రీడాభూమి

జింబాబ్వేకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులవాయో, నవంబర్ 2: వెస్టిండీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి జింబాబ్వే తృటిలో తప్పించుకుంది. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి గ్రేమ్ క్రెమర్ (28 నాటౌట్)తో కలిసి క్రీజ్‌లో ఉన్న రెగిన్ చకాబ్వా (71 నాటౌట్) జింబాబ్వేను ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్ గెల్చుకోగా, 0-1 తేడాతో వెనుకబడిన జింబాబ్వే రెండో టెస్టులోనూ రాణించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109.1 ఓవర్లలో 326 పరుగులు చేసి ఆలౌటైంది. హామిల్టన్ మసకజా సెంచరీ (147) సాధించగా, సికందర్ రజా (80), పీటర్ మూర్ (52) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. విండీస్ బౌలర్ కెమెర్ రోచ్ 44 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. షానన్ గాబ్రియెల్, దేవేంద్ర బిషూ చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 178.2 ఓవర్లు ఆడి, 448 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. మొదట్లో కీరన్ పావెల్ 90, షాయ్ హోప్ 40 పరుగులతో రాణించగా, చివరిలో షేన్ డౌరిచ్ (103), కెప్టెన్ జాసన్ హోల్డర్ (110) శతకాలు నమోవదు చేశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు వెనుకబడిన జింబాబ్వే, మ్యాచ్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 301 పరుగులు చేయగలిగింది. సికందర్ రజా 89, పీటర్ మూర్ 42 పరుగులు చేశారు. జట్టు ఆలౌట్ కాకుండా రెగిన్ చకాబ్వా (78 నాటౌట్), గ్రేమ్ క్రెమెర్ (29 నాటౌట్) అడ్డుకున్నారు. విండీస్ బౌలర్లు గాబ్రియెల్, రోజ్, బిషూ తలా మూడు వికెట్లు సాధించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ తన ఖాతాలో వేసుకుంది.