క్రీడాభూమి

బాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ సెకండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: గుంటూరుకు చెందిన భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలను మెరుగు పరచుకొని ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిఎఐ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను మొత్తం 73,403 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను, అంతకు ముందు డెన్మార్క్ ఓపెన్‌ను కైవసం చేసుకోవడంతో శ్రీకాంత్ పాయింట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌పై కనే్నశాడు. కాగా, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ 77,930 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, దక్షిణ కొరియాకు చెందిన సొన్ వాన్ హో తృతీయ స్థానంలో ఉన్నాడు.
మార్పులేని సింధు ర్యాంక్
‘తెలుగు తేజం’ పివి సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. రియో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాలను సాధించిన ఆమె మొత్తం 82,486 పాయింట్లు సంపాదించుకోగా, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జూ ఇంగ్ 95,539 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ కొరియాకు చెందిన సంగ్ జి హ్యున్ కూడా తన మూడో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది.
ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10’
పురుషుల విభాగం
1. విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్/ 77,930 పాయింట్లు), 2. కిడాంబి శ్రీకాంత్ (్భరత్/ 73,403 పాయింట్లు), 3. సన్ వాన్ హో (దక్షిణ కొరియా/ 71,738 పాయింట్లు), 4. లిన్ డాన్ (చైనా/ 68,746 పాయింట్లు), 5. చెన్ లాంగ్ (చైనా/ 67,646 పాయింట్లు), 6. చౌ తియాన్ చెన్ (చైనీస్ తైపీ/ 65,691 పాయింట్లు), 7. షి యుకీ (చైనా/ 61,897 పాయింట్లు), 8. లీ చాంగ్ వెయ్ (మలేసియా/ 61,794 పాయింట్లు), 9. ఇంగ్ కా లాంగ్ అగ్నస్ (హాంకాంగ్/ 56,749 పాయింట్లు), 10. జూ వెయ్ వాంగ్ (చైనీస్ తైపీ/ 53,330 పాయింట్లు).
మహిళల విభాగం
1. తాయ్ జూ ఇంగ్ (చైనీస్ తైపీ/ 95,539 పాయింట్లు), 2. పివి సింధు (్భరత్/ 82,486 పాయింట్లు), 3. సంగ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా/ 75,805 పాయింట్లు), 4. అకానే యమాగూచీ (జపాన్/ 74,599 పాయింట్లు), 5. కరోలినా మారిన్ (స్పెయిన్/ 73,787 పాయింట్లు), 6. రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్/ 68,191 పాయింట్లు), 7. సన్ యూ (చైనా/ 63,761 పాయింట్లు), 8. నజోమీ ఒకుహరా (జపాన్/ 63,567 పాయింట్లు), 9. చెన్ యుఫెయ్ (చైనా/ 62,150 పాయింట్లు), 10. హి బియాంగ్‌జియావో (చైనా/ 62,112 పాయింట్లు).
* భారత క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ 55,690 పాయింట్లతో పదకొండవ స్థానంలో ఉంది.

చిత్రం..ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు మెరుగు పరచుకున్న కిడాంబి శ్రీకాంత్