క్రీడాభూమి

పారిస్ మాస్టర్స్ నుంచి నాదల్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 3: పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరుసగా నాలుగో ఏడాది టాప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న నాదల్ ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో ఉరుగ్వేకి చెందిన పాబ్లో కువాస్‌ను ఓడించాడు. అయితే ఈ మ్యాచ్‌లో విజయం కోసం నాదల్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరంభం నుంచే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 6-3 తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్న నాదల్‌కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో 6-7 (5/7) తేడాతో రెండో సెట్‌ను చేజార్చుకున్న నాదల్ నిర్ణాయక మూడో సెట్‌లో విజృంభించి తనదైన పవర్‌ఫుల్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా 6-3 తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకుని కువాస్‌ను మట్టికరిపించిన నాదల్ బెర్సీ హార్డ్ కోర్ట్స్‌లో తొలిసారి టైటిల్ సాధించేందుకు ఎదురు చూస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ 16 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న నాదల్ క్వార్టర్ ఫైనల్‌లో సెర్బియాకు చెందిన ఫిలిప్ క్రాజినోవిచ్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 77వ స్థానం)తో తలపడాల్సి ఉంది. అయతే ఈ మ్యాచ్‌లో నాదల్ మోకాలికి గాయమవడంతో అతను ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రీక్వార్టర్ ఫైనల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో క్రాజినోవిచ్ 6-2, 3-6, 6-1 తేడాతో నికోలస్ మహట్‌పై విజయం సాధించాడు. అలాగే అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో, అమెరికాకు చెందిన 9వ సీడ్ ఆటగాడు జాన్ ఇస్నర్, ఫ్రాన్స్‌కు చెందిన జూలియన్ బెనె్నటు, జాక్ సాక్ (అమెరికా), ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్), క్రొయేషియాకు చెందిన మూడో సీడ్ ఆటగాడు మారిన్ సిలిచ్ కూడా తమతమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో డెల్ పోట్రో7-5, 6-4 తేడాతో రాబిన్ హాస్‌పై, జాన్ ఇస్నర్ 7-6 (12/10), 5-7, 7-6 (7/3) తేడాతో గ్రిగర్ దిమిత్రోవ్‌పై విజయం సాధించగా, జూలియన్ బెనె్నటు 6-3, 6-3 తేడాతో డేవిడ్ గోఫిన్ (బెల్జియం)ను, జాక్ సాక్ 7-6 (8/6), 6-3 తేడాతో లూకాస్ పౌలీ (ఫ్రాన్స్)ను, ఫెర్నాండో వెర్డాస్కో 6-4, 6-4 తేడాతో ఐదో సీడ్ డొమినిక్ థియెమ్‌ను, సిలిచ్ 7-6(4), 6-2 తేడాతో రాబెర్టో బటిస్టా అగట్ (స్పెయిన్)ను ఓడించారు.