క్రీడాభూమి

జోరుగా.. హుషారుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 3: న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడి ఎస్‌సిఎ (సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో) జరుగనున్న రెండో మ్యాచ్‌కి టీమిండియా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు న్యూఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 53 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించిన విషయం విదితమే. పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ఇప్పుడు అదే ఊపుతో రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడిస్తే ఐదేళ్లలో టీమిండియా మూడో సిరీస్‌ను గెలుచుకున్నట్లవుతుంది. అయితే పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో అత్యంత బలీయమైన జట్టుగా ఖ్యాతి పొందడంతో పాటు ప్రపంచ టి-20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ జట్టు తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రెండో మ్యాచ్‌లో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని ‘దెబ్బతిన్న పులి’లా ఎదురు చూస్తోంది. అయితే కివీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు టి-20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించడం ప్రత్యర్థులను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు, ప్రత్యేకించి ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ విజృంభించి ఆడి న్యూజిలాండ్‌పై భారత్ తొలి విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. వీరితో పాటు టీమిండియా పేస్ బౌలింగ్ విభాగానికి సారథ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చివరి ఓవర్లలో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభిస్తుడటం, అలాగే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కూడా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తుండటం భారత జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తోంది. ఈ విధంగా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కొనసాగిస్తూ ఆల్‌రౌండ్ ప్రతిభతో ముందుకు సాగుతున్న టీమిండియాను ప్రతిఘటించడం న్యూజిలాండ్ జట్టుకు నిస్సందేహంగా ‘కత్తిమీద సాము’ లాంటి పనే. కేన్ విలియమ్‌సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలంటే టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు చేర్చగలగాలి. అయితే తొలి టి-20 మ్యాచ్‌లో 16 ఓవర్ల పాటు విజృంభించి ఆడిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చెరో అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 158 పరుగుల భారీ భాగస్వామ్యంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు పటిష్టమైన పునాది వేశారు. దీంతో ఆ తర్వాత భారత జట్టు కొన్ని ఒడిదుడుకులకు లోనైనప్పటికీ అంతిమంగా 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరును సాధించి ప్రత్యర్థులకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కొత్త బంతితో సరిగా రాణించలేకపోవడంతో ఆ జట్టుకు ఈ పరిస్థితి ఎదురైంది. ఎంతో అనుభవజ్ఞులైన బౌలర్లుగా పేరు పొందిన వీరిద్దరూ డెత్ ఓవర్లలో టీమిండియా పేసరు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మాదిరిగా యార్కర్లను సంధించడంలో విఫలమవడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చిత్రం..* న్యూజిలాండర్లను హడలెత్తిస్తున్న రోహిత్ శర్మ
*శుక్రవారం రాజ్‌కోట్‌లో సాధన చేస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు