క్రీడాభూమి

చాంపియన్లూ చిత్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకమిగహరా, నవంబర్ 3: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో ఆతిథ్య డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను మట్టికరిపించిన భారత జట్టు ఫైనల్‌లో మరోసారి చైనాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గుర్జీత్ కౌర్ రెండు గోల్స్‌తో సత్తా చాటుకోగా, నవ్‌జ్యోత్ కౌర్, లాల్‌రెమ్సియామీ చెరో గోల్‌తో రాణించి జపాన్ పతనాన్ని శాసించారు. దీంతో భారత జట్టు నాలుగోసారి ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆసియా కప్ 2004 ఎడిషన్‌లో టైటిల్ సాధించిన భారత జట్టు 1999, 2009లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాణీ రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ నెల 5వ తేదీన (ఆదివారం) జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 4-1 గోల్స్ తేడాతో చైనా జట్టును ఓడించిన భారత జట్టు ఫైనల్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న గుర్జీత్ కౌర్ 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్‌కు తొలి గోల్‌ను అందించింది. ఆ తర్వాత 9వ నిమిషంలో నవ్‌జ్యోత్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించగా, అదే నిమిషంలో గుర్జీత్ సాధించిన రెండో గోల్‌తో భారత్ 3-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. అయితే ఆతిథ్య జపాన్ జట్టు మాత్రం భారత్ జోరును చూస్తూ కూర్చోలేదు. 17వ నిమిషంలో షిహో సుజీ జపాన్‌కు తొలి గోల్‌ను అందించగా, 11 నిమిషాల తర్వాత యుయి ఇషిబాషి సాధించిన ఫీల్డ్ గోల్‌తో ప్రథమార్థం ముగిసే సమయానికి భారత్ ఆధిక్యత 3-2కు తగ్గింది. అయితే థర్డ్ క్వార్టర్‌లో మరింత విజృంభించి ఆడిన భారత జట్టుకు 38వ నిమిషంలో లాల్‌రెమ్సియామీ భారత్‌కు మరో గోల్‌ను అందించింది. ఈ టోర్నీలో ఆమెకు ఇదే తొలి గోల్. దీంతో 4-2 ఆధిక్యతలోకి దూసుకెళ్లిన భారత జట్టు ఆ తర్వాత డిఫెన్స్‌కు పరిమితమైంది. ప్రత్యర్థులు గోల్స్ సాధించకుండా సమర్థవంతంగా ప్రతిఘటించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత జట్టు 10-0 గోల్స్ తేడాతో సింగపూర్‌ను, 4-1 గోల్స్ తేడాతో చైనాను, 2-0 గోల్స్ తేడాతో మలేషియానూ ఓడించి తమ పూల్‌లో టాపర్‌గా నిలిచిన భారత జట్టు గురువారం కజకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1-7 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న చైనా జట్టు 1989లో తొలిసారి ఆసియా కప్‌ను సాధించడంతో పాటు 2009లో జరిగిన ఫైనల్‌లో 5-3 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. అయినప్పటికీ ప్రస్తుత టోర్నీ లీగ్ దశలో 4-1 గోల్స్ తేడాతో ఓడించి సత్తా చాటుకున్న భారత జట్టే ఇప్పుడు టైటిల్ రేసులో ముందుంది.