క్రీడాభూమి

ఇప్పుడు విజయం మా వంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకమిగహరా (జపాన్), నవంబర్ 4: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ కోసం భారత జట్టు ఆదివారం ఇక్కడ మాజీ చాంపియన్ చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు బెర్తును ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ‘ఆసియా కప్ టైటిల్‌ను సాధించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని మేము ఎదురు చూస్తున్నాం’ అని భారత జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆసియా కప్ టోర్నీ పూల్ దశలో అజేయంగా ముందుకు సాగిన భారత జట్టు ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్‌లో కజకిస్థాన్‌ను, సెమీ ఫైనల్‌లో ఆతిథ్య డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను మట్టికరిపించిన విషయం విదితమే. ఇప్పుడు చైనాతో జరుగనున్న ఫైనల్ పోరులోనూ అదే జోరును కొనసాగించి టైటిల్ విజేతగా నిలవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ‘్భరత పురుషుల జట్టు ఆసియా కప్‌ను గెలుచుకోవడం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు విజయం సాధించడం మా వంతు. మా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఎంతో ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. చైనాతో టైటిల్ పోరు కోసం మా జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం మేము పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. జపాన్‌తో మా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎంతో చక్కగా సాగింది. ప్రతి మ్యాచ్‌లోనూ మంచి శుభారంభంతో ముందడుగు వేయాలన్నదే మా ప్లాన్. మా జట్టులోని వారంతా తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. మా కోచ్‌లు రూపొందించిన వ్యూహాల ప్రకారం ఆడుతూ తప్పిదాలకు పెద్దగా ఆస్కారం లేకుండా చూసుకుంటున్నాం’ అని రాణీ రాంపాల్ పేర్కొంది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్ పోరులో 4-2 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను మట్టికరిపించి మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్న భారత జట్టు అంతకుముందు పూల్ దశలో 4-1 గోల్స్ తేడాతో చైనా జట్టు (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం)ను కూడా ఓడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఫైనల్‌లో చైనా జట్టును తేలిగ్గా తీసుకోబోమని రాణీ రాంపాల్ స్పష్టం చేసింది. చైనా ఎంతో మంచి జట్టన్న విషయం మాకు తెలుసు. ఆ జట్టు శక్తిసామర్ధ్యాలను అంచనా వేయలేం. ఇంతకుముందు పూల్ దశలో మేము చైనాపై విజయం సాధించినప్పటికీ ఫైనల్‌లో ఆ జట్టును తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదు. రేపటి మ్యాచ్‌లో చైనాతో ఎలా ఆడాలన్న దానిపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ మ్యాచ్‌లో మా కోచ్‌లు నిర్ధేశించిన వ్యూహం ప్రకారం ముందుకు సాగుతాం’ అని రాణీ రాంపాల్ తెలిపింది. గతేడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ పూల్ దశలో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో చైనా చేతిలో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్‌లో అదే జట్టును 2-1 గోల్స్ తేడాతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్న విషయం విదితమే.

చిత్రాలు..అప్రతిహతంగా దూసుకెళ్తున్న భారత జట్టు
* ప్రత్యర్థులను గడగడలాడిస్త్తున్న గుర్జీత్ కౌర్