క్రీడాభూమి

బోర్డు ఏజీఎం వరకే వెంగ్‌సర్కార్ సేవలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ) కమిటీ సభ్యుడిగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ సేవలు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకే కొనసాగుతాయని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. బోర్డుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) శనివారం సమావేశమైనప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే, సీఓఏ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పేరు తెలిపేందుకు ఇష్టపడని ఒక బోర్డు అధికారి పీటీఐతో మాట్లాడుతూ వెంటగ్‌సర్కార్‌ను తొలగిస్తున్నామంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. వెంగ్‌సర్కార్‌తో బోర్డుకు అసలు ఒప్పందమే లేదని, కాబట్టి, అతనిని తొలగించే ప్రశే్న ఉత్పన్నం కాదని తేల్చిచెప్పాడు. ఎన్‌సీఏ పాలక మండలిలో ఖాళీ ఏర్పడితే, తాత్కాలిక పద్దతిలో ఎవరినైనా నియమిస్తారని, ప్రస్తుతం వెంగ్‌సర్కార్ అదే విధానంలో కొనసాగుతున్నాడని చెప్పాడు. సర్వసభ్య సమావేశంలో కొత్త సభ్యుడ్ని ఎన్నుకుంటారని, అప్పటి వరకే వెంగ్‌సర్కార్ సేవలు ఉంటాయని వివరించాడు. ఇలావుంటే, అవసరం ఎక్కువ కాలం ఉండదని దాని చైర్మన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ గతంలో చేసిన ప్రకటన నేపథ్యంలో శనివారం నాటి సమావేశం ఆసక్తిని రేపింది. బోర్డు పాలనా వ్యవహారాలను చక్కదిద్దడంతోపాటు, లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసే బాధ్యతను అప్పగిస్తూ వినోద్ రాయ్ నాయకత్వంలో నలుగురు సభ్యులతో కూడిన సిఒఎను జనవరి 30న సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడమే తమ బాధ్యతగా ప్రకటించిన సిఒఎ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. వాటి అమలు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇలావుంటే, లోధా సిఫార్సుల అమలుకు వీలుగా నిబంధనావళిని బిసిసిఐ సవరించాలి. మిగతా సభ్య సంఘాలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రెండు అంశాల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ సీఓఏ ముందుకు వెళుతున్నది. 2013 ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ తర్వాత, దేశ క్రికెట్‌ను పారదర్శంగా ఉండేలా సీఓఏ కీలకంగా వ్యవహరిస్తున్నది. బిసిసిఐ ఒంటెద్దు పోకడలకు ఇప్పుడు క్రమంగా తెరపడుతున్నది. కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ చివరికి ఒక వ్యాపారంగా మారిపోతున్న తరుణంలో సిఒఎ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అయితే, శనివారం నాటి సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు.

చిత్రం..దిలీప్ వెంగ్‌సర్కార్