క్రీడాభూమి

సాకర్ సంబరాల్లో హింస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, నవంబర్ 12: రష్యాలో వచ్చే ఏడాది జరిగే ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు మొనాకో అర్హత సంపాదించడంతో, అభిమానులు జరుపుకున్న సంబరాలు హింసాత్మకంగా మారాయి. కీలక మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌ను 2-0 తేడాతో ఓడించిన మొనాకో 1998 తర్వాత మొదటిసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. బ్రసెల్స్‌లో మొనాకో జాతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. వారంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలాంటి సంబరాలకు వేదికైన బౌర్స్ స్టాక్ ఎక్చ్సేంజ్ భవనం వద్ద గుమిగూడిన సుమారు 300 మంది అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. సంబరం పేరుతో అక్కడ నిలిపివున్న వాహనాలకు నిప్పటించారు. కనిపించిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో, పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను చెదరగొట్టారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ నష్టం తప్పింది. అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.