క్రీడాభూమి

డిసెంబర్ ఒకటిన బీసీసీఐ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: పాలనాధికారుల బృందం (సీఓఏ) ఆదేశాల ప్రకారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. డిసెంబర్ ఒకటిన ఈ సమావేశం జరుగుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న కొచ్చి టస్కర్స్‌తో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం, టెస్టు, వనే్డ సిరీస్‌లుసహా భవిష్యత్ టోర్నీల ఖరారు, రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ)పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడం అనే మూడు కీలక అంశాలను ఎస్‌జిఎం చర్చిస్తుంది. అకారణంగా తమకు ఐపీఎల్‌లో చోటు లేకుండా చేశారంటూ ఆరోపిస్తున్న కేరళ టస్కర్స్ తమకు 850 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కోర్టులో కేసు వేసింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసే తరుణంలో కోర్టు కేసులు ఉండడం మంచిది కాదని సీఓఏ ఇది వరకే సూచించడంతో, సమస్యను పరిష్కరించుకోవడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నది. అందుకే, ఈ అంశాన్ని ఎస్‌జీఎం అజెండాలో చేర్చింది.
సెలక్టర్లకు ఎక్స్‌టెన్షన్: వచ్చే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వరకూ ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న జాతీయ సెలక్షన్ కమిటీకి ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఏంజీఎంలో కొత్త సెలక్షన్ కమిటీపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.