క్రీడాభూమి

పది జట్లు.. నాలుగు నెలలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, నవంబర్ 16: ఎనిమిది జట్ల స్థానంలోనే పది జట్లు.. రెండు నెలల నుంచి నాలుగు నెలలకు పెరిగిన నిడివి. ఫుట్‌బాల్ విందును అందించడానికి నాలుగో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. నిరుటి విజేత అట్లాటికో డి కోల్‌కతా (ఏటీకే), రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్‌తో తాజా సీజన్ మొదలుకానుంది. 2014లో ఈ టోర్నమెంట్ మొదలుకాగా, ఫైనల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను 1-0 తేడాతో ఓడించిన ఏటీకే టైటిల్ సాధించింది. 2015లో, అప్పటి డిఫెండింగ్ చాంపియన్, రన్నరప్ జట్లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యాయి. టైటిల్ పోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌పై 3-2 ఆధిక్యంతో విజయం సాధించిన చెనె్నయిన్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. అయితే, నిరుడు మరోసారి మొదటి ఐఎస్‌ఎల్ ఫైనల్ పునరావృతమైంది. టైటిల్ కోసం ఏటీకే, కేరళ బ్లాస్టర్స్ తుది వరకూ పోరాటం సాగించాయి. అయితే, నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు చెరొక గోల్‌ను మించి సాధించలేకపోయాయి. ఇంజురీ టైమ్‌తోపాటు, ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. దీనితో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది. షూటౌట్‌లో ఏటీకే నాలుగు గోల్స్ చేసి, రెండోసారి టైటిల్‌ను అందుకోగా, మూడు గోల్స్‌కే పరిమితమైన కేరళ బ్లాస్టర్ మరోసారి రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఈ టోర్నీలో విజేత జట్టుకు ఎఎఫ్‌సి కప్ టోర్నమెంట్‌లో పాల్గొనే అర్హత దక్కుతుంది. క్వాలిఫయర్స్‌తో సంబంధం లేకుండా ఎఎఫ్‌సి కప్ టోర్నీలో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడానికి బరిలో ఉన్న పది జట్లు హోరాహోరీగా పోరాటం సాగిస్తాయనడంలో అనుమానం లేదు. ఐ-లీగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ చేరికతో ఐఎస్‌ఎల్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలో పేరుప్రఖ్యాతులున్న విదేశీ క్రీడాకారులతో కలిసి ఆడే అవకాశం దక్కడం భారత ఫుట్‌బాలర్స్‌కు ఒక వరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ నైపుణ్యానికి పదును పెట్టుకోవడానికి భారత యువ క్రీడాకారులు శ్రమించడం ఖాయం. ఫిఫా ప్రపంచ కప్‌ను గెల్చుకున్న అలెస్సాండ్రో డెల్ పియెరో, మార్కో మాటెరజీ, రాబర్టో కార్లొస్ వంటి విదేశీ స్టార్లు ఐఎస్‌ఎల్‌లో ఆడుతున్నారు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహించిన దిమితార్ బెర్బతోవ్, టొటెన్హామ్ హాట్స్‌పర్ మాజీ ఫార్వర్డ్ ఆటగాడు రాబీ కీన్ తదితరులు ఏటీకే విజయపరంపరల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారితో కలిసి ఆడితే అపారమైన అనుభవం లభిస్తుంది. వారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగితే, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది. దేశంలోని ఆటగాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన అధికారులు ప్రతి జట్టునూ మార్క్యూ ప్లేయర్ పేరును ఇవ్వాలని ఆదేశించారు. ఏ జట్టులోనూ ఎనిమిది మంది కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీ క్రీడాకారులు ఉండరాదనే నిబంధన మొదటి నుంచే ఉంది. టోర్నమెంట్ ప్రమాణాలను పెంచడంతోపాటు, దీనిని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ క్రీడాకారులను ఆహ్వానిస్తున్న అధికారులు, మరోవైపు స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. వారిని అంతర్జాతీయ పోటీలకు సంసిద్ధం చేసేందుకు కృషి జరుపుతున్నారు.