క్రీడాభూమి

కవర్ల కిందే ఈడెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 16: అందరూ భయపడుతున్నట్టుగానే ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌ని వర్షం బెడద వెంటాడింది. మొదటి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రోజులో ఎక్కువ భాగం ఈడెన్ గార్డెన్స్ పిచ్ కవర్ల కిందే ఉండిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశ పరచింది. ఒకవైపు వర్షం, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీసహా భారత టాప్ ఆర్డర్ వైఫల్యాలు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిచాయి. వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి భారత్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ లోకేష్ రాహుల్ పెవిలియన్ చేరాడు. సురంగ లక్మల్ వేసిన ఔట్ స్వింగర్ మెరుపువేగంతో దూసుకొచ్చి, రాహుల్ బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా చేతుల్లోకి వెళ్లింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 11 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేసిన తర్వాత లక్మల్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ను చేజార్చుకుంది. బంతి అనూహ్యంగా దిశను మార్చుకుంటూ, సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో, బ్యాటింగ్ చేయడానికి చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ నానా తంటాలు పడ్డారు. 11 బంతులు ఎదర్కొని, పరుగుల ఖాతాను తెరవకుండానే లక్మల్ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయి కోహ్లీ వెనుదిరగడంతో ప్రేక్షకులు నీరుగారిపోయారు. అనంతరం పుజారా, అజింక్య రహానే వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 43 బంతులు ఆడిన పుజారా అజేయంగా 8 పరుగులు చేశాడు. ఈ పరుగులు ఫోర్ల ద్వారా లభించినవే కావడం విశేషం. అతనితోపాటు నాటౌట్‌గా ఉన్న రహానే 5 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేదు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 0, శిఖర్ ధావన్ బి సురంగ లక్మల్ 8, చటేశ్వర్ పుజారా 8 నాటౌట్, విరాట్ కోహ్లీ ఎల్‌బి సురంగ లక్మల్ 0, అజింక్య రహానే 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మత్తొం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 17.
వికెట్ల పతనం: 1-0, 2-13, 3-17.
బౌలింగ్: సురంగ లక్మల్ 6-6-0-3, లాహిరు గామగే 5.5-1-16-0.

చిత్రం..సూపర్ సోపర్‌తో ఈడెన్ గార్డెన్స్ ఔట్‌ఫీల్డ్‌పై నీటిని తోడేస్తున్న దృశ్యం