క్రీడాభూమి

ఏడేళ్లలో మొదటిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భారత జట్టు స్వదేశంలో జరిగిన ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడం 2010 తర్వాత ఇదే మొదటిసారి. ఏడేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో ఇదే పరిస్థితి ఎదురైంది. కాగా, గత 30 సంవత్సరాల్లో టీమిండియా ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో యాభై, అంతకంటే ఎక్కువ పరుగులకు ఐదు వికెట్లు చేజార్చుకోవడం ఇది 17వ సారి. ఈ మ్యాచ్‌లో మరో అరుదైన సంఘటన కూడా చేసుకుంది. మొదటి రోజు ఆట, మొదటి బంతికే భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ ఔటైన విషయం తెలిసిందే. ఈ విధంగా ఔటైన భారత ఆటగాళ్లలో రాహుల్ ఆరోవాడు. అంతకు ముందు సునీల్ గవాస్కర్, సురూ నాయక్, డబ్ల్యువి రామన్, శివ్‌సుందర్ దాస్, వాసిం జాఫర్ ఈ విధంగా టెస్టు మ్యాచ్‌లో మొదటి బంతికే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌కి ముందు వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలను సాధించిన అతను హఠాత్తుగా మొదటి బంతికే వెనుదిరిగడం అభిమానులను నిరాశ పరచింది. కాగా, గవాస్కర్ మొత్తం మూడు పర్యాయాలు టెస్టు మ్యాచ్ మొదటి బంతికే ఔటై, ఎవరూ ఇష్టపడని అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.
మొదటి రోజు, మొదటి బంతికే వికెట్ కూల్చిన సురంగ లక్మల్‌కు రెండో రోజు ఆటలో వికెట్లు లభించలేదు. తొలిరోజున అతను మూడు వికెట్లు పడగొట్టగా, రెండో రోజు ఆటలో కూలిన రెండు వికెట్లను దుసాన్ షణక తన ఖాతాలో వేసుకున్నాడు. అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్‌ను అతను పెవిలియన్‌కు పంపాడు. అతను ఈ ఇన్నింగ్స్‌లో 46 డాట్ బాల్స్ వేయడం గమనార్హం. 2001 నుంచి ఇప్పటి వరకూ ఇన్ని డాట్ బాల్స్ వేసిన బౌలర్ అతనే కావడం విశేషం. ఇంతకు ముందు, 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వెస్టిండీస్ బౌలర్ జెరోమ్ టేలర్ 40 బంతులను ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వేశాడు.

చిత్రం..సర్దార్ సింగ్