క్రీడాభూమి

‘వాడా’దే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలను నిర్వహించే విషయంలో బాధ్యత మొత్తం ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)పైనే ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి, ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశాడు. ఢిల్లీ హాఫ్ మారథాన్ ఈవెంట్‌కు హాజరైన అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని కితాబునిచ్చాడు. భారత క్రికెటర్లకు డోప్ పరీక్ష నిర్వహించాలా? వద్దా? అన్నది తమ పరిధిలోకి రాదని, వాడానే తుది నిర్ణయం తీసుకోవాలని అతను అన్నాడు. డోప్ పరీక్షలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, తగిన రీతిలో స్పందించాల్సిన బాధ్యత వాడాపై ఉందన్నాడు. ప్రపంచంలోని అన్ని క్రీడా సంఘాలు, సామఖ్యలు తప్పనిసరిగా డోప్ పరీక్షకు అంగీకరించాలని వాడా ఇది వరకే జారీ చేసిన ఆదేశాన్ని గురించి ప్రస్తావించగా, క్రికెట్‌కు సంబంధించినంత వరకూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ద్వారా భారత ఆటగాళ్లకు డోప్ పరీక్షపై నిర్ణయాన్ని ప్రకటింప చేయాలని రాజ్యవర్ధన్ సూచించాడు.