క్రీడాభూమి

స్విస్ ఓపెన్ బాడ్మింటన్ విజేత ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెల్: భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఇక్కడ జరిగిన స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెమీ ఫైనల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన తనొంగ్‌సక్ సయేసొంబూన్‌సక్‌ను 21-18, 22-24, 21-9 తేడాతో ఓడించిన అతను ఆదివారం నాటి ఫైనల్‌లో మార్క్ విబ్లెర్‌పై వరుస సెట్లలో విజయభేరి మోగించడం విశేషం. సెమీస్‌లో హెన్రీ హర్స్‌కైనెన్‌పై గెలిచిన విబ్లెర్ ఫైనల్‌లో ప్రణయ్ ముందు నిలవలేకపోయాడు. అద్భుతమైన షాట్లు, ప్లేసింగ్స్‌తో విరుచుకుపడిన ప్రణయ్ 21-18, 21-15 తేడాతో విబ్లెర్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో హి బింగియావో టైటిల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె వాంగ్ ఇహాన్‌ను 21-16, 21-10 తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఇహాన్ ఫైనల్‌లో అదే స్థాయిలో ఆడలేక రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది.