క్రీడాభూమి

వనే్డ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 27: అవిశ్రాంత షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాల పట్ల జాతీయ సెలక్షన్ కమిటీ సానుకూలంగా స్పందించింది. శ్రీలంకతో జరగబోయే వనే్డ సిరీస్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చింది. అయితే, ఢిల్లీలో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే చివరి, మూడో టెస్టులో అతను ఆడతాడని ప్రకటించింది. వచ్చేనెల 10 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మూడో టెస్టుకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ, విజయ్ శంకర్.
వనే్డ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శికర్ ధావన్, రహానే, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ధోనీ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్.