క్రీడాభూమి

అశ్విన్ రికార్డు ‘ట్రిపుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 27: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌ల్లో 300 మైలురాయిని చేరిన బౌలర్ల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. లాహిరు గామగేను ఔట్ చేయడం ద్వారా భారత్‌ను విజయపథంలో నడిపించిన అశ్విన్ కెరీర్‌లో 300 వికెట్లు పూర్తి చేశాడు. కెరీర్‌లో 54వ టెస్టు ఆడిన అశ్విన్ ఈ మైలురాయిని చేరుకోగా, 36 సంవత్సరాల క్రితం, 1981లో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ 56 టెస్టులతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. ముత్తయ్య మురళీధరన్ మూడు వందల టెస్టు వికెట్లకు 58 మ్యాచ్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. రిచర్డ్ హాడ్లీ, మాల్కం మార్షల్, డేల్ స్టెయిన్ తలా 61 మ్యాచ్‌ల్లో మూడు వందల వికెట్లను పూర్తి చేశారు. షేన్ వార్న్, అలాన్ డొనాల్డ్‌కు 63 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.
బంతులు కూడా తక్కువే..
తక్కువ మ్యాచ్‌ల్లోనేగాక, తక్కువ బంతుల్లో 300 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ అశ్విన్ రికార్డు పుస్తకాల్లోకి చేరాడు. అతను 15,634 బంతుల్లో మూడు వందల వికెట్లు సాధించాడు. షేన్ వార్న్ 18,501, ముత్తయ్య మురళీధరన్ 18,622, రంగన హెరాత్ 19,367, హర్భజన్ సింగ్ 19,867 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకొని, వరుసగా రెండు నుంచి ఐదు స్థానాలను ఆక్రమించారు.
రోజుల్లో కొలిస్తే..
రోజుల పరంగా చూస్తే, మూడు వందల టెస్టు వికెట్లను పడగొట్టడానికి తక్కువ సమయం తీసుకున్న బౌలర్ల జాబితాలో అశ్విన్‌కు రెండో స్థానం దక్కింది. షేన్ వార్న్ 2,196 రోజుల్లో ఈ ఘనతను సాధిస్తే, అశ్విన్ 2,214 రోజులు తీసుకున్నాడు. ఇయాన్ బోథం 2,570 రోజుల్లో మూడు వందల వికెట్లు పడగొట్టాడు. గ్లేన్ మెక్‌గ్రాత్ 2,577, స్టువర్ట్ బ్రాడ్ 2798, మిచెల్ జాన్సన్ 2,822 రోజుల్లో మూడు వందల టెస్టు వికెట్లను తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
భారతీయుల్లో ఐదోవాడు
టెస్టుల్లో ఎక్కువ వికెట్లు సాధించిన భారతీయ బౌలర్లలో ఐదో వాడిగా అశ్విన్ గుర్తింపు సంపాదించాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జహీర్ ఖాన్ 311 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. భారత క్రికెట్‌లో సమర్థులైన బౌలర్లుగా పేరు తెచ్చుకున్న బిషన్ సింగ్ బేడీ (266), భవగత్ చంద్రశేఖర్ (242), ఎర్రాపల్లి ప్రసన్న (189) కంటే అశ్విన్ మెరుగైన స్థితిలో ఉండడం విశేషం.