క్రీడాభూమి

లంకపై టీమిండియా సూపర్ విక్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 27: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచిన విరాట్ కోహ్లీ సేన ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో లంకను చిత్తుచేసింది. భారత్‌కు టెస్టుల్లో ఇదే భారీ విజయం. మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే లంక ఆలౌట్‌కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 405 పరుగులు వెనుకబడిన లంక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి సదీర సమరవిక్రమ (0) వికెట్‌ను కోల్పోయి 21 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగు రోజు, సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, మరో 13 పరుగులు జోడించి రెండో వికెట్‌ను దిముత్ కరుణరత్నే రూపంలో చేజార్చుకుంది. 45 బంతులు ఎదుర్కొన్న అతను 18 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మురళీ విజయ్ చక్కటి క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. ఆతర్వాత వికెట్ల పతనం కొనసాగి, లంకను ప్రమాదంలోకి నెట్టింది. 62 బంతులు ఎదుర్కని, మూడు ఫోర్లతో 23 పరుగులు చేసిన లాహిరు తిరిమానేను రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా ఉమేష్ యాదవ్ ఔట్ చేశాడు. కెప్టెన్ దినేష్ చండీమల్ క్రీజ్‌లో పాతుకుపోయి, వీరోచిత పోరాటంతో అర్ధ శతకాన్ని నమోదు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి తగినంత సహకారం లభించలేదు. జట్టును ఆదుకుంటాడనుకున్న మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కేవలం పది పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా (4), దసున్ షణక (17) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దిల్‌రువాన్ పెరెరా (0), రంగన హెరాత్ (0) వికెట్లను అశ్విన్ ఒకే ఓవర్‌లో వెనక్కు పంపడంతో, మ్యాచ్‌ని కనీసం డ్రా చేసుకునే అవకాశాలను కూడా శ్రీలంక కోల్పోయింది. బాధ్యతాయుతంగా ఆడి, 82 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లతో 61 పరుగులు చేసిన కెప్టెన్ చండీమల్‌ను అశ్విన్ క్యాచ్ అందుకోగా, ఉమేష్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఫలితం లేదని తెలిసినప్పటికీ చమటోడ్జిన సురంగ లక్మల్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, లాహిరు గామనే పరుగుల ఖాతాను తెరవకుండానే అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కావడంతో, 49.3 ఓవర్లలో 166 పరుగులకే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, ఇశాంత్ శర్మ, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
* ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలిచి, భారత్ తన టెస్టు చరిత్రలో రెండోసారి అత్యంత భారీ విజయాన్ని నమోదు చేయగా, శ్రీలంక మొదటిసారి ఇంత ఘోరంగా పరాజయాన్ని ఎదుర్కొంది. 2007లో బంగ్లాదేశ్‌తో డాకాలో జరిగిన టెస్టును ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ అదే ఆధిక్యంతో విజయం సాధించడం గమనార్హం. 1999లో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 219, 2010లో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో భారత్ విజయాలను నమోదు చేసింది. కాగా, శ్రీలంకపై ఇంతకు ముందు నమోదు చేసిన గొప్ప విజయం కూడా ఇదే ఏడాది నమోదు కావడం విశేషం. లంక పర్యటనకు వెళ్లినప్పుడు పల్లేకల్ టెస్టులో కోహ్లీ సేన ఇన్నింగ్స 171 పరుగుల తేడాతో గెలిచింది.
* ఇలావుంటే, శ్రీలంకకు భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకు ముందు 2001లో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో ఓడిన ఆ జట్టుకు ఇది మరింత దారుణమైన పరాజయం. 1993లో దక్షిణాఫ్రికా చేతిలోనే కొలంబోలో ఇన్నింగ్స్ 208 పరుగులు, 2012లో మెల్బోర్న్ టెస్టులో ఇన్నింగ్స్ 201 పరుగుల తేడాతో శ్రీలంక పరాజయాలను చవిచూసింది.

కెప్టెన్‌గా 31 టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన వారి జాబితాలో విరాట్ కోహ్లీకి మూడో స్థానం లభించింది. రికీ పాంటింగ్ 23, స్టీవ్ వా 21 విజయాలతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇది 20వ టెస్టు విజయం. మైఖేల్ వాన్ 19 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా, ఈ టెస్టుల్లో రికీ పాంటింగ్ 3, స్టీవ్ వా 5, కోహ్లీ 3, మైఖేల్ వాన్ 5 చొప్పున పరాజయాలు చవిచూశారు.

స్కోరుబోర్డు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 79.1 ఓవర్లలో 205 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 51, దినేష్ చండీమల్ 57, నిరోషన్ డిక్‌విల్లా 24, ఇశాంత్ శర్మ 3/37, అశ్విన్ 4/67, రవీంద్ర జడేజా 3/56).
భారత్ తొలి ఇన్నింగ్స్: 176.1 ఓవర్లలో 6 వికెట్లకు 610 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 128, చటేశ్వర్ పుజారా 143, విరాట్ కోహ్లీ 213, రోహిత్ శర్మ 102 నాటౌట్, లాహిరు గామగే 1/97, రంగన హెరాత్ 1/81, దసున్ షణక 1/103, దిల్‌రువాన్ పెరెరా 3/202).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 21): సదీర సమరవిక్రమ బి ఇశాంత్ శర్మ 0, దిముత్ కరుణరత్నే సి మురళీ విజయ్ బి రవీంద్ర జడేజా 18, లాహిరు తిరిమానే సి రవీంద్ర జడేజా బి ఉమేష్ యాదవ్ 23, ఏంజెలో మాథ్యూస్ సి రోహిత్ శర్మ బి రవీంద్ర జడేజా 10, దినేష్ చండీమల్ సి అశ్విన్ బి ఉమేష్ యాదవ్ 61, నిరోషన్ డిక్‌విల్లా సి విరాట్ కోహ్లీ బి ఇశాంత్ శర్మ 4, దసున్ షణక సి లోకేష్ రాహుల్ బి అశ్విన్ 17, దిల్‌రువాన్ పెరెరా ఎల్‌బి అశ్విన్ 0, రంగన హెరాత్ సి అజింక్య రహానే బి అశ్విన్ 0, సురంగ లక్మల్ 31 నాటౌట్, లాహిరు గామగే బి అశ్విన్ 0, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 166.
వికెట్ల పతనం: 0-1, 2-34, 3-48, 4-68, 5-75, 6-102, 7-107, 8-107, 9-165, 10-166.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 12-4-43-2, రవిచంద్రన్ అశ్విన్ 17.3-4-63-4, రవీంద్ర జడేజా 11-5-28-2, ఉమేష్ యాదవ్ 9-2-30-2.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెల్చుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ