క్రీడాభూమి

ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానానికి పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 28: ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా మరో రెండు అడుగులు ముందుకేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ఇక్కడ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో పుజారా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో మరోసారి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ జాబితాలో యథాతథంగా ఐదో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగా, అతని తర్వాత రెండో స్థానంలో నిలిచిన పుజారాకు టాప్-5లోని మిగిలిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మధ్య కేవలం 11 పాయింట్లు మాత్రమే తేడా ఉందని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్-శ్రీలంక జట్ల మధ్య సోమవారం నాగ్‌పూర్‌లో ముగిసిన రెండో టెస్టులో పుజారా శతకంతో రాణించడంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను మళ్లీ రెండో స్థానానికి చేరుకోగలిగాడు. ఈ ఏడాది మార్చి నెలలో ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రపంచ ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో తొలిసారి రెండో ర్యాంకును దక్కించుకున్న పుజారా, ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో 133 పరుగులు సాధించడంతో మరోసారి రెండో ర్యాంకుకు చేరుకున్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న పుజారా నాగ్‌పూర్‌లో శ్రీలంకపై 143 పరుగులతో సత్తా చాటుకోవడంతో అతని ఖాతాలో మరో 22 రేటింగ్ పాయింట్లు జమ అయ్యాయి. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఒకేసారి రెండు స్థానాలను మెరుగుపర్చుకుని మళ్లీ రెండో ర్యాంకును దక్కించుకున్న పుజారా ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యధికంగా 888 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అతను కోహ్లీ కంటే 11 పాయింట్ల ముందంజలో ఉన్నాడు. అయితే ఇప్పటివరకూ 817 రేటింగ్ పాయింట్లు కలిగివున్న కోహ్లీ నాగ్‌పూర్ టెస్టులో విజృంభించి ఆడి డబుల్ సెంచరీ సాధించిన విషయం విదితమే. కెరీర్‌లో ఇప్పటివరకూ 62 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీకి ఇది ఐదో డబుల్ సెంచరీ. దీంతో అతని మొత్తం రేటింగ్ పాయింట్లు 877కు పెరిగినప్పటికీ ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో ర్యాంకు మాత్రం మారలేదు.
ఇదిలావుంటే, మరోవైపు యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముగిసిన తొలి టెస్టులో 141 పరుగుల అజేయ స్కోరుతో రాణించి కంగారూల విజయంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ 57 టెస్టు మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌కు ఇది 21వ సెంచరీ. ఈ ప్రదర్శనతో మరో ఐదు రేటింగ్ పాయింట్లు రాబట్టుకున్న స్మిత్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 941 పాయింట్లు ఉన్నాయి. దీంతో అతను టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (961 పాయింట్లు), లెన్ హట్టన్ (945), జాక్ హోబ్స్ (942), రికీ పాంటింగ్ (942), పీటర్ మే (941) సరసన నిలిచాడు.