క్రీడాభూమి

హెరత్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 28: టీమిండియాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే చివరి టెస్టులో శ్రీలంక సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగన హెరత్ ఆడటం లేదు. ప్రస్తుతం అతను వెన్ను నొప్పితో బాధపడుతుండటమే ఇందుకు కారణం. దీంతో శ్రీలంక అతని స్థానంలో యువ లెగ్‌బ్రేక్ బౌలర్ జెఫ్రీ వాండెర్సేని జట్టులోకి తీసుకుంది. కెరీర్‌లో ఇప్పటివరకూ 11 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లు, మరో ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడిన వాండెర్సే ఇప్పుడు ఢిల్లీలో జరుగనున్న మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. వాస్తవానికి రంగన హెరత్ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ మలింద పుష్పకుమారను చేర్చుకోవాలని శ్రీలంక జట్టు యాజమాన్యం భావించింది. అయితే ఫిట్నెస్ పరీక్షలో పుష్పకుమార విఫలమవడంతో వాండెర్సేని అవకాశం వరించింది. ప్రస్తుతం శ్రీలంక జట్టులో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న హెరత్ గురువారం స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు.
చివరి టెస్టుకు శ్రీలంక జట్టు ఇదే..
దినేష్ చండీమల్ (కెప్టెన్), దైముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, లహిరు తిరిమానే, నిరోషన్ డిక్వెల్లా (వికెట్‌కీపర్), దిల్‌రువన్ పెరీరా, సురంగ లక్మల్, లహిరు గమగే, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, లక్షన్ సందకన్, విశ్వ ఫెర్నాండో, దాసన్ షనక, రోషన్ సిల్వా, జెఫ్రీ వాండెర్సే.

చిత్రం.. జెఫ్రీ వాండెర్సే