క్రీడాభూమి

అత్యుత్తమ స్పిన్నర్.. నిస్సందేహంగా అశ్వినే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ స్పిన్నర్ అశ్వినేనని, బంతితో అశ్విన్ సాధించిన విజయాలే అతని గొప్పతనానికి నిదర్శనమని మురళీధరన్ కొనియాడాడు. నాగ్‌పూర్‌లో సోమవారం శ్రీలంకతో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 300 వికెట్ల మైలురాయిని అధిగమించడంతో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ నెలకొల్పిన రికార్డును బద్ధలుకొట్టి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా (54వ మ్యాచ్‌లో) ఈ ఫీట్ సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. దీంతో అశ్విన్‌కు మురళీధరన్ అభినందనలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 133 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మురళీధరన్ 800 వికెట్లు కైవసం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం విదితమే. అయితే టెస్టుల్లో 300 వికెట్లు కైవసం చేసుకోవడం అంత తేలికైన పనేమీ కాదని, ఇది చాలా పెద్ద విజయమని, అత్యంత వేగవంతంగా ఈ ఘనత సాధించిన అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మురళీధరన్ పీటీఐ వార్తా సంస్థతో అన్నాడు. ‘ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ అశ్వినే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అతను భారత వనే్డ జట్టులో లేకపోవచ్చు. అయినప్పటికీ అతను మళ్లీ వనే్డ జట్టులో ప్రవేశించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అద్భుతాలు సృష్టిస్తాడని ఆశిస్తున్నా’ అని మురళీధరన్ పేర్కొన్నాడు. డెన్నిస్ లిల్లీ 1981లో ఆడిన 56వ మ్యాచ్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత 36 ఏళ్లకు అశ్విన్ అంతకంటే వేగంగా ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో అతను వేగవంతంగా 300 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో డెన్నిస్ లిల్లీతో పాటు ముత్తయ్య మురళీధరన్ (58 టెస్టులు), రిచర్డ్ హ్యాడ్లీ (61 టెస్టులు), మాల్కమ్ మార్షల్ (61 టెస్టులు), డేల్ స్టెయిన్ (61 టెస్టులు), షేన్ వార్న్ (63 టెస్టులు), అలెన్ డొనాల్డ్ (63 టెస్టులు) లాంటి ప్రముఖుల కంటే ఎంతో ముందున్నాడు. అయితే టెస్టుల్లో వేగవంతంగా 400, 500, 600, 700, 800 వికెట్లు కైవసం చేసుకుని మురళీధరన్ నెలకొల్పిన రికార్డులను అధిగమించడమే అశ్విన్ ముందున్న అసలు సిసలైన సవాలు. ఈ ప్రశ్నకు కాలమే సమాధనం చెప్పాల్సి ఉంటుందన్నాని మురళీధరన్ అన్నాడు. ‘ప్రస్తుతం 32వ పడిలో ఉన్న అశ్విన్ కనీసం మరో నాలుగైదేళ్లయినా ఆడగలడు. మున్ముందు అతను గాయాల బారిన పడకుండా ఎంతమేరకు రాణించగలుగుతాడన్నది కూడా వేచిచూడాల్సిందే. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఆటలో రాణించగలగడం ఎవరికైనా కష్టమే. కనుక ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని మురళీధరన్ స్పష్టం చేశాడు.

చిత్రం..భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌