క్రీడాభూమి

క్షేమంగా ఉన్నా.. నన్ను చంపొద్దు : అక్మల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 29: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చనిపోయాడంటూ సామాజిక మాథ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమై ప్రస్తుతం ఫిట్నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీలో తంటాలు పడుతున్న ఉమర్ అక్మల్ ఈ పుకార్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బతికే ఉన్నానని, లాహోర్‌లో క్షేమంగా ఉన్నానని జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు ఫిట్నెస్‌పై దృష్టి కేంద్రీకరించానని, కనుక దయచేసి తనను చంపవద్దని అతను ట్వీట్ చేశాడు. అయినప్పటికీ ఈ పుకార్లు ఆగకపోవడంతో అతను మరోసారి స్పందించాడు. తాను చనిపోయానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిక్షేపంగా బతికే ఉన్నానని అక్మల్ ఒక వీడియోను పోస్టు చేశాడు. ‘దేవుని దయ వలన నాకు ఏమీ కాలేదు. నేను ఇంకా బ్రతికే ఉన్నా. నేను చనిపోయినట్లు కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరేమనుకున్నా నేను ప్రాణాలతోనే ఉన్నా. త్వరలో జరిగే నేషన్-20 కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నన్ను చూస్తారు. కనుక నేను చనిపోయానంటూ ఎలాంటి వార్తలూ వ్యాప్తి చేయవద్దని కోరుతున్నా’ అని అక్మల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఉమర్ అక్మల్ ఫొటో పెట్టి అతను చనిపోయాడని పోస్టు చేయడం కలకలాన్ని రేపింది. దీంతో తాను బతికే ఉన్నానని ఉమర్ అక్మల్ రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సి వచ్చింది.