క్రీడాభూమి

ప్రపంచ కప్ సాకర్ మస్కట్‌గా ‘జబివాక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, నవంబర్ 29: ప్రపంచ కప్ సాకర్-2018 టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌తో పాటు మస్కట్‌ను నిర్వాహకులు బుధవారం రష్యాలో ఆవిష్కరించారు. గోల్‌కీపర్‌గా రష్యా జట్టుకు ఎనలేని సేవలందించిన లివ్ యాషిన్ ఫొటోను ఈ పోస్టర్‌పై పొందుపర్చారు. అనంతరం మస్కట్‌ను విడుదల చేసిన నిర్వాహకులు, రష్యాలో కనిపించే తోడేలును ఈ మస్కట్‌కు ఎంచుకున్నారు. దీనికి ‘జబివాక’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రపంచ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న రష్యా ఎంతో గర్వపడాల్సిన సమయమిదని, రష్యాలో పోటీలు నిర్వహిస్తున్నప్పుడే ఆ దేశ ఆటగాడి చిత్రాన్ని పోస్టర్‌గా ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. 1958 నుంచి 1970 వరకు వరుసగా నాలుగుసార్లు ప్రపంచ కప్ టోర్నీల్లో రష్యాకు ప్రాతినిథ్యం వహించిన యాషిన్ 1990లో మరణించాడు. ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఇచ్చే ప్రతిష్టాత్మక బలూన్ డీఆర్ అవార్డును అందుకున్న ఏకైక గోల్‌కీపర్ యాషిన్ కావడం విశేషం. రష్యాలో వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15వ తేదీ వరకు జరిగే ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్‌లో మొత్తం 32 దేశాల జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రాను నిర్వాహకులు శుక్రవారం వెల్లడించనున్నారు.