క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 29: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి, అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ ఆడుతుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ఆమె ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే ఇందుకు కారణం. అలాగే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్న రష్యా భామ స్వెత్లానా కుజ్నెత్సొవా కూడా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచి కెరీర్‌లో 23వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ సాధించినప్పుడు రెండు నెలల గర్భవతిగా ఉన్న ఆమె గత సెప్టెంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వచ్చే ఏడాది ఈ టోర్నీలో సెరెనా తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్లు ఆమె కోచ్ ప్యాట్రిక్ వౌరాతొగ్లోవ్ తెలిపాడు. ప్రస్తుతం సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోందని ఆయన చెప్పాడు. త్వరలో ఫ్లోరిడాకు వెళ్లి సెరెనాను కలుసుకుంటానని, ఆమె ఏ స్థాయిలో టెన్నిస్ ఆడగలదో, ఆటకు ఆమె శరీరం ఏవిధంగా ప్రతిస్పందిస్తుందో పరిశీలించిన తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనలా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ప్యాట్రిక్ స్పష్టం చేశాడు.
ఇదిలావుంటే, మణికట్టుకు రెండు గాయాలవడంతో ఈ నెల ఆరంభంలో శస్తచ్రికిత్స చేయించుకున్న స్వెత్లానా కుజ్నెత్సొవా ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి కోలుకుంటున్నానని, మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగాలన్న దానిపై తాను ఇంకా ఎటువంటి కాల పరిమితిని నిర్దేశించుకోలేదని స్థానిక మీడియాకు తెలిపింది.

చిత్రం..గతేడాది టైటిల్ సాధించిన సెరెనా విలియమ్స్