క్రీడాభూమి

కోహ్లీయే కీలకం.. ఆ ముగ్గుర్నీ తక్కువగా చూడం : షకీబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: భారత్‌కు విరాట్ కోహ్లీ కీలక ఆటగాడే కానీ మిగతా బ్యాట్స్‌మెన్‌ను తమ జట్టు తేలిగ్గా తీసుకోబోదని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మంగళవారం ఇక్కడ చెప్పారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనాలు ఇప్పటివరకు టోర్నమెంట్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినప్పటికీ తాము మాత్రం భారత జట్టులోని ఏ ఆటగాడినీ తేలిగ్గా తీసుకోమని షకీబ్ చెప్పాడు. భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టని, అందువల్ల తాము మరింత జాగ్రత్తగా ఉండాలని, అలాగే బౌలింగ్, ఫీల్డింగ్‌లో మరింత క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉందని మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ షకీబ్ చెప్పాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అతను అంటూ, అయితే భారత్‌పై గెలవలాంటే తమ జట్టు గొప్ప క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
అరాఫత్ సన్నీ, తస్కిన్ అహ్మద్‌ల సస్పెన్షన్‌పై జట్టు స్పందన ఏమిటని అడగ్గా, ఇద్దరు కీలక బౌలర్లు సస్పెండ్ కావడం నిజంగా బాధాకరమే అయినప్పటికీ, తమ చేతిలో ఏమీ లేనందున ఏమీ చేయలేమన్నాడు. కాగా, సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చక్కగా రాణించిన మహమ్మదుల్లాను బ్యాటింగ్‌లో ముందుకు తీసుకు వస్తారా అని అడగ్గా, అది కోచ్, కెప్టెన్‌లు తీసుకోవలసిన నిర్ణయమని షకీబ్ చెప్పాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కొన్ని కీలకమైన క్యాచ్‌లు వదిలిపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉందని కూడా షకీబ్ చెప్పాడు.