క్రీడాభూమి

షాన్ మార్ష్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 3: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లకు 442 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. షాన్ మార్ష్ అజేయ సెంచరీతో రాణించడంతో ఆసీస్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు ఆటకు కూడా వర్షం వల్ల ఆటంకం కలిగింది. తొలి రోజు 81 ఓవర్ల ఆట జరగ్గా, నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించింది. షాన్ మార్ష్ 231 బంతులు ఎదుర్కొని 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, టిమ్ పైన్ 102 బంతుల్లో 57, పాట్ కమిన్స్ 90 బంతుల్లో 44 పరుగులు చేశారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ క్రెగ్ ఓవర్టన్ 105 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ 72 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆటను వర్షం కారణంగా నిలిపివేసే సమయానికి 9.1 ఓవర్లలో మార్క్ స్టోన్‌మన్ (18) వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 149 ఓవర్లలో 8 వికెట్లకు 442 డిక్లేర్డ్ (డేవిడ్ వార్నర్ 47, ఉస్మాన్ ఖాజా 53, స్టీవెన్ స్మిత్ 40, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36, షాన్ మార్ష్ 126, టిమ్ పైన్ 57, జేమ్స్ ఆండర్సన్ 1/74, స్టువర్ట్ బ్రాడ్ 2/72, క్రిస్ వోక్స్ 1/84, క్రెగ్ ఓవర్టన్ 3/105).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 29.

చిత్రం..షాన్ మార్ష్ 123 నాటౌట్