క్రీడాభూమి

లారాను అధిగమించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారా రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. నాగపూర్ టెస్టులో డబుల్ సెంచరీ చేసినప్పుడు, కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలతో లారా రికార్డును కోహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకతోనే న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మరోసారి డబుల్ సెంచరీతో కదంతొక్కిన అతను లారా రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నప్పుడు నాలుగేసి పర్యాయాలు డబుల్ సెంచరీలు చేసిన డొనాల్డ్ బ్రాడ్‌మన్, మైఖేల్ క్లార్క్, గ్రేమ్ స్మిత్ ఇప్పుడు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు.
మ్యాచ్ మొదటి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 156 పరుగులు చేసిన 29 ఏళ్ల కోహ్లీ ఆదివారం ఉదయం అదే ఊపును కొనసాగించాడు. కెరీర్‌లో 63వ టెస్టు ఆడుతున్న అతను సురంగ లక్మల్ బౌలింగ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అతని 243 పరుగుల స్కోరులో 25 బౌండరీలు ఉన్నాయి. 287 బంతులు ఎదుర్కొన్న అతను 135 డాట్ బాల్స్ ఆడాడు.
వినోద్ కాంబ్లీ తర్వాత, రెండు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన రెండో భారతీయుడిగా కోహ్లీ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. కోహ్లీసహా ఈ ఫీట్‌ను ప్రపంచ టెస్టు క్రికెట్‌లో కేవలం నలుగురు మాత్రమే ఉండడం విశేషం. డొనాల్డ్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా/ ఇంగ్లాండ్‌పై) మూడు పర్యాయాలు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసి, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్/ న్యూజిలాండ్‌పై), వినోద్ కాంబ్లీ (్భరత్/ ఇంగ్లాండ్‌పై), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా/ ఇంగ్లాండ్‌పై), ఇప్పుడు కోహ్లీ (్భరత్/ శ్రీలంకపై)
టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ సరసన కోహ్లీకి చోటు దక్కింది. వీరంతా తలా ఆరు డబుల్ సెంచరీలు సాధించారు. కాగా, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌లో సచిన్, సెవాగ్‌తో పాటు మర్వన్ అటపట్టు (శ్రీలంక), జావేద్ మియందాద్ (పాకిస్తాన్), యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)తో కలిసి కోహ్లీ సంయుక్తంగా ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. వీరంతా ఆరేసి డబుల్ సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో 12 టెస్టు డబుల్ సెంచరీలు ఉన్నాయి. కుమార సంగక్కర (శ్రీలంక) 11, బ్రియాన్ లారా (వెస్టిండీస్) 9 డబుల్ సెంచరీలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. వారీ హమ్మండ్ (ఇంగ్లాండ్), మహేల జయవర్ధనే (శ్రీలంక) చెరి ఏడు డబుల్ సెంచరీలతో నాలుగో స్థానాన్ని పంచుకుంటున్నారు.

చిత్రం..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ