క్రీడాభూమి

పుజారాయే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: క్రికెట్‌లో, ప్రత్యేకించి టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవడానికి ఎంతో ఏకాగ్రత అవసరమని, దీనిని తాను సహచరుడు చటేశ్వర్ పుజారా నుంచే నేర్చుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక చానెల్ కోసం పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు. అర్ధ శతకాలను సెంచరీలుగా మార్చడంలో పుజారానే తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, ఇష్టాన్ని పెంచుకున్నప్పుడే టెస్టు ఫార్మాట్‌లో రాణించగలుగుతామని అన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బంతి విపరీతంగా బౌన్స్ అవుతుందని, కాబట్టి, అలాంటి పిచ్‌లపై ఆడడాన్ని అలవాటు చేసుకోవాలని కోహ్లీ హితవు పలికాడు. భారీ స్కోర్లు చేసిన ప్రతిసారీ ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను సంపాదించుకోవాలని గత 17 నెలల కాలంలో ఆరు డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీ అన్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించడం కష్టమనే విషయం తమకు తెలుసునని, కాబట్టి, ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పాడు. ఇందుకు ఫిట్నెస్ ఎంతో అవసరమవుతుందని అన్నాడు. ఫిట్నెస్ కోసం నిరంతరం శ్రమించక తప్పదని స్పష్టం చేశాడు. తనపై ఎక్కువ బాధ్యత ఉందన్న విషయాన్ని అతను అంగీకరించాడు. 2012 నుంచి ఈ పరిస్థితి మొదలైందని అన్నాడు. అందుకు వైఫల్యాలను ఎదుర్కొన్న తాను ఐపిఎల్‌లో మెరుగ్గా ఆడానని, ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెంచరీ చేశానని గుర్తుచేశాడు. అనంతరం, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 180 పరుగులు సాధించానని, అప్పటి నుంచి తనపై అంచనాలు పెరిగిపోయాయని కోహ్లీ తెలిపాడు. తన ఆలోచనా విధానాల నుంచి ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నింటినో మార్చుకున్నానని చెప్పాడు. క్రమంగా బాధ్యతలు తెలుసుకొని ఆడడం మొదలుపెట్టానని, నిలకడగా ఆడడమే లక్ష్యంగా ఎంచుకున్నానని కోహ్లీ అన్నాడు.

చిత్రం..కోహ్లీతో పుజారా ఇంటర్వ్యూ