క్రీడాభూమి

ధోనీకి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తోనే ఉండేందుకు లైన్ క్లియరైంది. బుధవారం ఇక్కడ సమావేశమైన ఐపీఎల్ పాలక మండలి ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌తోపాటు సీఎస్‌కేపైన కూడా రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. దీనితో గత రెండు ఐపీఎల్ పోటీల్లో ఈ రెండు జట్లు ఆడలేదు. వాటి స్థానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు తరపైకి వచ్చాయి. ధోనీ రైజింగ్ పుణే తరఫున ఆడాడు. మొదట్లో అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పినప్పటికీ, ఆతర్వాత బాధ్యతలను స్టీవెన్ స్మిత్‌కు అప్పగించారు. ఇలావుంటే, రెండేళ్ల విరామం తర్వాత, సీఎస్‌కే, రాజస్థాన్ జట్లకు గతంలో ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లు అవే ఫ్రాంచైజీల తరఫున ఆడేందుకు వీలు ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఆటగాళ్ల వేలంలో ఈ రెండు ఫ్రాంచైజీలు లేవు కాబట్టి, 2015లో వాటి తరఫున ఆడిన క్రికెటర్లకు తిరిగి అవే జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదన్న వాదన వినిపించింది. అయితే, ఈ సందేహాలకు ఐపీఎల్ పాలక వర్గం తెరదించింది. సీఎస్‌కే, రాజస్థాన్ ఫ్రాంచైజీలు 2015లో తమ వద్ద ఉన్న ఆటగాళ్లలో చెరి ఐదుగురిని రీటైన్ చేసుకోవచ్చని ప్రకటించింది. మిగతా వారు వేలానికి వెళతారని పేర్కొంది. ఇలావుంటే, ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునే అవకాశం ఉందికాబట్టి, ధోనీకి సీఎస్‌కేలో చోటు ఖచ్చితంగా లభిస్తుంది. మొత్తం మీద చాలాకాలంగా వేధిస్తున్న ప్రశ్నలకు ఐపీఎల్ పాలక మండలి సమాధానం చెప్పి, సస్పెన్స్‌కు తెరదించింది.