క్రీడాభూమి

ఆచితూచి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 7: ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ (ఎఫ్‌టీపీ) షెడ్యూల్‌పై వస్తున్న విమర్శలు, అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) భవిష్యత్ నిర్ణయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సభ్యులకు గురువారం ఇక్కడ ప్రారంభమై రెండు రోజుల వర్క్‌షాప్‌లో బీసీసుఐ పాల్గొంటున్నది. 2016-17 సీజన్‌లో విరామం లేకుండా సిరీస్‌లు, టోర్నీలో ఉన్నందున తాము తీవ్ర అలసటకు గురవుతున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శించడంతో, 2019-23 ఎఫ్‌టీపీపై బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఒఏ) చీఫ్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. 2019లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరగనున్నందున, ఎఫ్‌టీపీని జాగ్రత్తగా ఖరారు చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. రెండు రోజుల ఈ వర్క్‌షాప్‌లో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడాల్సి వస్తున్నదంటూ ఆటగాళ్లు లేవనెత్తిన అంశాన్ని బీసీసీఐ ప్రస్తావిస్తుంది. పరిష్కార మార్గాలను అనే్వషిస్తుంది.