క్రీడాభూమి

మహిళలపై చిన్న చూపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ: మహిళా టెన్నిస్ పట్ల తనకు ఏమాత్రం చిన్నచూపు లేదని, తాను ఎప్పుడూ మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకొవిచ్ స్పష్టం చేశాడు. ఇటీవల ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్‌ను ఓడించి టైటిల్ సాధించిన తర్వాత జొకొవిచ్ మాట్లాడుతూ మహిళల కంటే పురుషుల విభాగంలో ప్రైజ్‌మనీ ఎక్కువ ఉండాలని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి పురుషుల విభాగంలోనే హోరాహోరీ పోరాటాలు సాగుతాయని, ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుందని అన్నాడు. అందుకే పురుషుల విభాగంలోనే ప్రైజ్‌మనీ ఎక్కువగా ఉండాలని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో తన మాట మార్చాడు. మహిళల టెన్నిస్ పట్ల చులకన భావం ఏదీ లేదని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జొకొవిచ్ అన్నాడు. వాస్తవానికి తాను మహిళల గురించి ఎలాంటి అవాంఛిత వ్యాఖ్యలు చేయలేదని, వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఎవరి శ్రమకు తగిన ఫలితాన్ని వారు కోరుకోవడంలో తప్పులేదని అన్నాడు. తమకు ప్రైజ్‌మనీ పెంచితే బాగుటుందని మాత్రమే తాను చెప్పానని, కష్టపడినప్పుడు తగిన పారితోషికాన్ని ఆశిస్తామని వివరించాడు. మహిళల విభాగంలో మ్యాచ్‌ని నెగ్గడానికి రెండు సెట్లలో గెలవాలని, అదే పురుషుల విభాగంలో మూడు సెట్లను సొంతం చేసుకోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని జొకొవిచ్ అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఎక్కువగా కష్టపడే వారికి ఎక్కువ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కాలనుకోవడంలో తప్పులేదన్నాడు. టెన్నిస్ తనకు జీవితంలో ఎన్నో ఇచ్చిందని, తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉండడానికి ఆ క్రీడే ప్రధాన కారణమని జొకొవిచ్ చెప్పాడు. కాబట్టి, టెన్నిస్‌ను ఉద్దేశించి తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడబోనని అన్నాడు.
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డైరెక్టర్ రేమండ్ మూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పురుషుల విభాగంతో అనుసంబంధానమై మహిళల టెన్నిస్ ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ వంటి మేటి ఆటగాళ్లను టెన్నిస్ ప్రపంచానికి అందించినందుకు మహిళా క్రీడాకారిణులంతా ప్రతి రోజూ మోకాలిపై మోకరిల్లి భగవంతుడికి కృతజ్ఞతలు తెలపాలని అన్నాడు. పురుషుల ప్రతిభ వల్లే టెన్నిస్‌కు ఆదరణ పెరుగుతున్నదని, ఆ కారణంగానే మహిళ టెన్నిస్ మనుగడ సాగించగలుగుతున్నదని పేర్కొన్నాడు. కాగా మూర్ వ్యాఖ్యలపై ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ విరుచుకుపడింది. పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మహిళల టెన్నిస్ ఆదరణ పొందుతున్నదని వ్యాఖ్యానించింది. మోకరిల్లి ప్రార్థించాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పింది. సెరెనాతోపాటు పలువురు టెన్నిస్ స్టార్లు, వివిధ రంగాల ప్రముఖులు కూడా మూర్ వైఖరిని ఖండించారు. లింగ వివక్షతో కూడి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. స్వర్వత్రా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మూర్ క్షమాపణ చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. అయితే, తన మాటలు సహజంగానే క్రీడాకారిణులను బాధిస్తాయని, వారిని కించ పరిచే విధంగానే ఉన్నాయని మూర్ చెప్పాడు. తాను చేసిన పొరపాటుకు చింతిస్తున్నానని, బేషరతుగా క్షమాపణ చెప్పుకొంటున్నానని అన్నాడు. మూర్ వివాదం సమసిపోకముందే మహిళా టెన్నిస్‌ను చులకన చేసే విధంగా జొకొవిచ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. టెన్నిస్‌లో కొనసాగుతున్న లింగ వివక్షను మహిళా స్టార్లంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించే ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన జొకొవిచ్ మాట మార్చాడు. తమ శ్రమకు తగిన పారితోషికాన్ని కోరామే తప్ప ఎవరికీ కించ పరచలేదన్నాడు.