క్రీడాభూమి

మియామీ ఓపెన్‌లో సానియా బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 25: అమెరికాలో జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) శుభారంభాన్ని సాధించారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో లారా అరువాబరెనా (స్పెయిన్), రలుకా ఒలారు (రొమేనియా) జోడీని మట్టి కరిపించారు. దాదాపు గంటసేపు పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, హింగిస్ 6-0, 6-4 తేడాతో సునాయాసంగా ప్రత్యర్థులను చిత్తుచేసి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
అయితే ఈ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బొపన్న, అతని భాగస్వామి ఫ్లోరిన్ మెర్గియాకు ఆదిలోనే చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో వీరు పాబ్లో కువాస్ (ఉరుగ్వే), మార్సెల్ గ్రానోలర్స్ (స్పెయిన్) జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-2 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న బొపన్న, మెర్గియా జోడీకి ఆ తర్వాత ప్రత్యర్థులను ప్రతిఘటించడంలో విఫలమయ్యారు. ఫలితంగా బొపన్న, మెర్గియా 4-6, 4-10 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకుని ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు.