క్రీడాభూమి

వేటు తప్పింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 28: పూర్తిగా ఫామ్‌ను కోల్పోయిన తనపై ఎప్పుడో వేటు పడాల్సి ఉన్నదని, ఆ ప్రమాదం తప్పిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచిన అతను గురువారం ఆట ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ జట్టులో కొనసాగించడం తన అదృష్టమన్నాడు. డబుల్ సెంచరీ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఆస్ట్రేలియాలోని పెర్త్, బ్రిస్బేన్, అడెలైడ్, సిడ్నీ, మెల్బోర్న్ మైదానాల్లో సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించిన 33 ఏళ్ల కుక్ అన్నాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ ఒక్కడే ఈ ఐదు కేంద్రాల్లో సెంచరీలు నమోదు చేశాడు. 1977లో పెర్త్ (127 పరుగులు), బ్రిస్బేన్ (113 పరుగులు), మెల్బోర్న్ (118 పరుగులు), 1985లో అడెలైడ్ (166 నాటౌట్), 1986లో సిడ్నీ (172 పరుగులు) మైదానాల్లో గవాస్కర్ సెంచరీలు చేశాడు. కుక్ 2006లో పెర్త్ (116 పరుగులు), 2010లో బ్రిస్బేన్ (235 నాటౌట్), అడెలైడ్ (148 పరుగులు), 2011లో సిడ్నీ (189), తాజాగా మెల్బోర్న్ (ప్రస్తుతానికి 244 నాటౌట్) సెంచరీలు సాధించాడు. 31 ఏళ్ల రికార్డును సమం చేయడానికి ముందు అతను గత మూడు టెస్టుల్లో వరుసగా 2, 7, 37, 16, 7, 14 చొప్పున పరుగులు చేశాడు. లీన్ ప్యాచ్ నుంచి బయటపడి, డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
రెండు అవకాశాలు..
కుక్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడి, 409 బంతులు ఎదుర్కొని, 27 ఫోర్ల సాయంతో 244 పరుగులు సాధించి, నాటౌట్‌గా నిలవడంలో ఆస్ట్రేలియన్ల పాత్ర కూడా ఉంది. రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా ఫీల్డర్లు అతని క్యాచ్‌లు విడిచిపెట్టి, ఇతోథిక సాయం చేశారు. అతను 66 పరుగుల వద్ద ఒకసారి, 153 పరుగుల వద్ద రెండోసారి అతనికి లైఫ్ లభించింది.