క్రీడాభూమి

కుక్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 28: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ డబుల్ సెంచరీతో నాటౌట్‌గా నిలవడంతో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లకు 491 పరుగుల భారీ స్కోరు సాధించి, 164 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు సృష్టించాడు. 1984లో వెస్టిండీస్ స్టార్ వివియన్ రిచర్డ్స్ 208 పరుగులు సాధించగా, ఈ మ్యాచ్‌లో కుక్ 244 పరుగులతో నాటౌట్‌గా నిలవడం ద్వారా ఆ రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్ తరఫున ఈ మైదానంలో వాలీ హామండ్ 1928లో చేసిన 200 పరుగుల రికార్డును కూడా కుక్ తిరగరాశాడు. అంతేగాక, టెస్టు క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. అతను టెస్టు ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది 11వ సారి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 327 పరుగులకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసిన ఇంగ్లాండ్, మూడో రోజు ఆటను కొనసాగించి, మరో 299 పరుగులు జోడించి, ఏడు వికెట్లు చేజార్చుకుంది. జో రూట్ (61), స్టువర్ట్ బ్రాడ్ (56) అర్ధ శతకాలతో రాణించడంతో ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు సాధ్యమైంది. మూడో రోజు ఆటలో కుక్ డబుల్ సెంచరీ మినహా చెప్పుతగ్గ అంశాలేవీ లేవు. ఈ సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి బయటపడేందుకు శ్రమిస్తున్న ఇంగ్లాండ్ విజయం కంటే మ్యాచ్‌ని డ్రాగా ముగించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ జట్టు ఆట తీరు స్పష్టం చేస్తున్నది.