క్రీడాభూమి

ఇబ్బంది పెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎమిరిట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, దీనితో తన భార్య, కుమారుడు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు భార్య అయేషా, కుమారుడు జొరావర్‌తో కలిసి బయలుదేరిన ధావన్‌ను దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సర్ట్ఫికెట్లను చూపాల్సిందిగా కోరారు. అయితే, ఆయేషా, జొరావర్ పుట్టిన తేదీని నిరూపించే ధ్రువీకరణ పత్రంగానీ, ఇతరత్రా డాక్యుమెంట్లుగానీ లేకపోవడంతో, వారిని దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌లోకి అనుమతించలేదు. ఫలితంగా ధావన్ ఒక్కడే టీమిండియా సహచరులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. తనకు అవమానం జరిగిందని, తమ వద్ద లేని డాక్యుమెంట్లను చూపాల్సిందిగా ఎమిరేట్స్ అధికారులు డిమాండ్ చేయడంతో, భార్యాపిల్లలను దుబాయ్‌లోనే విడిచి తాను దక్షిణాఫ్రికా విమానం ఎక్కాల్సి వచ్చిందని ధావన్ ట్వీట్ చేశాడు. అలాంటి ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్న విషయం ముంబయిలో విమానం ఎక్కిన వెంటనే చెప్పివుంటే, పరిస్థితి మరో రకంగా ఉండేదని పేర్కొన్నాడు. కానీ, మార్గ మధ్యంలో నిబంధనల పేరుతో తమను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించాడు. తాను ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వారు వినలేదని ఆరోపించాడు. ఒక అదికారి తనతో చాలా దురుసగా ప్రవర్తించాడని తెలిపాడు.
మా పొరపాటు లేదు..
ధావన్ చేసిన ఆరోపణలపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. నిజానికి ఆ సంఘటనలో తమ పొరపాటు ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా నిబంధనలను అనుసరించి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అక్కడికి వెళ్లాలంటే తప్పనిసరిగా బర్త్ సర్ట్ఫికెట్‌ను చూపాల్సిందేనని తెలిపింది. పిల్లలను తీసుకెళ్లే వారు కూడా తమతమ గుర్తింపు పత్రాలను సమర్పించాలని పేర్కొంది. ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించాలని, ఇందులో తాము కొత్తగా సృష్టించి చెప్పే అంశాలు ఏవీ లేవని స్పష్టం చేసింది.

చిత్రం.. భార్య అయేషా, కుమారుడు జొరావర్‌తో శిఖర్ ధావన్