క్రీడాభూమి

ఒత్తిడితోనే ఆడాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 29: వరుస పరాజయాలు, వైఫల్యాల కారణంగా చోటు చేసుకున్న తీవ్రమైన ఒత్తిడితోనే తాను ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఆడి టైటిల్ సాధించానని భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. రియాద్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆనంద్ ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండా నిలకడగా ఆడాడు. మొత్తం 15 పాయింట్లకుగాను 10.5 పాయింట్లతో అతను రష్యాకు చెందిన వ్లాదిమిర్ ఫెడొసీవ్, ఇయాన్ నెపొన్మియాచీతో సమవుజ్జీగా నిలిచాడు. కీలకమైన రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను 2-0 తేడాతో గెల్చుకొని, 2003 తర్వాత మొదటిసారి మళ్లీ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ విజయం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, ఇందుకు కోసం తాను తీవ్రంగా శ్రమించానని రియాద్ నుంచి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ చెప్పాడు. నిజానికి గెలిచే అవకాశం లేదని అనుకుంటూనే ఈసారి ర్యాపిడ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు హాజరయ్యానని చెప్పాడు. చివరి వరకూ ప్రయత్నం కొనసాగించాలన్న పట్టుదలతో టోర్నమెంట్‌లో గేమ్స్ ఆడానని చెప్పాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించడం ఈ టోర్నీలో తనకు ఎంతో సంతృప్తినిచ్చిన అంశమని పేర్కొన్నాడు. ఒక రకంగా ఆ గేమ్‌తోనే తన విజయావకాశాలు మెరుగుపడ్డాయని ఆనంద్ అన్నాడు. బూ జియాంగ్జీపై గెలిచి, మంచి ఫామ్‌లో ఉన్న కార్ల్‌సెన్‌ను నిలువరించడం అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈసారి టోర్నమెంట్‌లో ఎన్నో పలుపులు, మరెన్నో ఉత్కంఠ భరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నాడు. విజయం ఎవరికైనా ఉత్సాహాన్నిస్తుందని, ఇదే ఆత్మవిశ్వాసంతో వచ్చే ఏడాది టోర్నీల్లో ఆడతానని ఆనంద్ తెలిపాడు.
ఆచితూచి ఆడుగు..
ర్యాపిడ్ చెస్ వరల్డ్ టైటిల్ సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ శుక్రవారం మొదలైన ప్రపంచ బ్లిడ్జ్ చాంపియన్‌షిప్‌లో ఆచితూచి అడుగేస్తున్నాడు. మొదటి ఆరు రౌండ్లలో అతను రెండు విజయాలు సాధించాడు. నాలుగు గేమ్స్‌ను డ్రా చేసుకున్నాడు.