క్రీడాభూమి

ధృవ్ 123 నాటౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 29: ఇక్కడి హోల్కర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ ఆరు వికెట్లకు 271 పరుగులు సాధించింది. ధృవ్ శౌరి అజేయ శతకం (123)తో రాణించడంతో ఢిల్లీకి ఈ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచిన విదర్భ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ ఓపెనర్లు కుణాల్ చండీలా (0), గౌతం గంభీర్ (15) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధృవ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, అతనికి నితీష్ రాణా (21), కెప్టెన్ రిషభ్ పంత్ (21) నుంచి అనుకున్నంత సహకారం లభించలేదు. అయితే, హిమ్మత్ సింగ్ కొంత సేపు విదర్భ బౌలింగ్‌కు ఎదురునిలిచి, అర్ధ శతకం సాధించడంతో ఢిల్లీ కోలుకుంది. అతను 66 పరుగులు చేసి ఔట్‌కాగా, మానన్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 88 ఓవర్లు ఆడి, 6 వికెట్లకు, 271 పరుగులు చేయగా, ధృవ్ 123, వికాశ్ మిశ్రా 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. విదర్భ బౌలర్లలో ఆదిత్య థ కారే, రజనీష్ గుర్బానీ చెరి 2 వికెట్లు పడగొట్టారు. సిద్దేశ్ నెరాల్, అక్షయ్ వఖారే చెరొక వికెట్ సంపాదించుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్: 88 ఓవర్లలో 6 వికెట్లకు 271 (్ధృవ్ శౌరి 123 నాటౌట్, నితీష్ రాణా 21, రిషభ్ పంత్ 21, హిమ్మత్ సింగ్ 66, ఆదిత్య థకారే 2/65, రజనీష్ గుర్బానీ 2/44).

చిత్రం.. ధృవ్ శౌరి