క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్‌గా రజనీష్ గుర్బానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నమొన్నటి వరకూ ఎవరికీ అంతగా పరిచయం లేని రజనీష్ గుర్బానీ ఈసారి రంజీ ట్రోఫీతో ఒక్కసారిగా స్టార్ అట్రాక్షన్‌గా మారిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ కర్నాటకపై గెలిచి, విదర్భ ఫైనల్ చేరడంలో కీలక భూమిక పోషించాడు. స్టువర్ట్ బిన్నీ, మాయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సీఎం గౌతం వంటి హేమాహేమీలతో కూడిన కర్నాటక బ్యాటింగ్ ఆర్డర్‌ను ఈ 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ చిన్నాభిన్నం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఏడు వికెట్లు సాధించి, ఎవరూ ఊహించని రీతిలో విదర్భకు ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న ఫైనల్‌లోనూ అతను సత్తా చాటుతున్నాడు. రెండో రోజు, శనివారం ఆటలో హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. రంజీ చరిత్రలోనే ఇది రెండో హ్యాట్రిక్. 1973 ఏప్రిల్‌లో జరిగిన రంజీ ఫైనల్‌లో అప్పటి బాంబేతో తలపడిన తమిళనాడుకు బాలసుబ్రహ్మణియన్ కల్యాణసుందరం హ్యాట్రిక్‌ను అందించాడు. బాంబే రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు చివరి నాలుగు వికెట్లను కల్యాణసుందరం పడగొట్టాడు. అయితే, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 44 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో గుర్బానీ హ్యాట్రిక్‌తో రాణించాడు.

చిత్రం..రజనీష్ గుర్బానీ