క్రీడాభూమి

సుశీల్ కుమార్‌పై ప్రతీకారం తీర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అకారణంగానే తనను గాయపరచిన సుశీల్ కుమార్‌పై రాబోయే ప్రో రెజ్లింగ్‌లో ప్రతీకారం తీర్చుకుంటానని భారత యువ రెజ్లర్ ప్రవీణ్ కుమార్ రాణా శపథం చేశాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి కోసమైనా సుశీల్‌ను ఓడిస్తానని ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ రాణా తెలిపాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొనే అర్హత కోసం నిర్వహించిన క్వాలిఫయర్స్ 74 కిలో విభాగంలో సుశీల్‌తో పోటీపడి రాణా పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో, సుశీల్, రాణా అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ సంఘటనలో రాణా సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాణా ఫిర్యాదు మేరకు సుశీల్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను రాణా ప్రస్తావిస్తూ, దాడుల వార్త విని తన తల్లి తల్లడిల్లిపోయందని అన్నాడు. ఆమెను ఆందోళనకు గురి చేసిన సుశీల్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ప్రో కబడ్డీలో అతనిని ఓడించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని అన్నాడు. తన విజయం ఖాయమని చెప్పాడు.