క్రీడాభూమి

వనే్డ ఇంటర్నేషనల్స్‌లో టాపర్ భారత కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 31: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన సంవత్సరాంతపు వనే్డ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను మొత్తం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత క్రికెటర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే ‘టాప్-10’లో ఉన్నాడు. అతనికి మూడో స్థానం దక్కింది. అక్షర్ పటేల్ 11, భువనేశ్వర్ కుమార్ 15 స్థానాల్లో ఉన్న బౌలింగ్ విభాగంలో హసన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు.
ఐసీసీ వనే్డ
క్రికెటర్ల ర్యాంకింగ్స్
బ్యాటింగ్
విభాగం: 1. విరాట్ కోహ్లీ (876 పాయింట్లు), 2. ఏబీ డివిలియర్స్ (872), 3. డేవిడ్ వార్నర్ (865), 4. బాబర్ ఆజమ్ (846), 5. రోహిత్ శర్మ (816), 6. క్వింటన్ డి కాక్ (808), 7. జో రూట్ (802), 8. ఫఫ్ డు ప్లెసిస్ (773), 9. హషీం ఆమ్లా (766), 10. కేన్ విలియమ్‌సన్ (750 పాయింట్లు).
* మహేంద్ర సింగ్ ధోనీ 729 పాయింట్లతో 12, శిఖర్ ధావన్ 726 పాయింట్లతో 15 స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్ విభాగం: 1. హసన్ అలీ (759 పాయింట్లు), 2. ఇమ్రాన్ తాహిర్ (743), 3. జస్‌ప్రీత్ బుమ్రా (729), 4. ట్రెంట్ బౌల్ట్ (723), 5. జొష్ హాజెల్‌వుడ్ (714), 6. కాగిసో రబదా (708), 7. మిచెల్ స్టార్క్ (684), 8. రషీద్ ఖాన్ (649), 9. లియామ్ ప్లంకెట్ (646), 10. మిచెల్ సాంట్నర్ (644 పాయింట్లు).
* అక్షర్ పటేల్ 643 పాయింట్లతో 11, భువనేశ్వర్ కుమార్ 621 పాయింట్లతో 15 స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్స్ విభాగం: 1. మహమ్మద్ హఫీజ్ (352 పాయింట్లు), 2. షకీబ్ అల్ హసన్ (345), 3. ఏంజెలో మాథ్యూస్ (321), 4. మహమ్మద్ నబీ (316), 5. బెన్ స్టోక్స్ (292), 6. జాసన్ హోల్డర్ (282), 7. జేమ్స్ ఫాల్క్‌నెర్ (280), 8. మోయిన్ అలీ (267), 9. మిచెల్ సాంట్నర్ (264), 10. మిచెల్ మార్ష్ (259 పాయింట్లు).
* భారత క్రికెటర్లలో హార్దిక్ పాండ్య ఒక్కడే ‘టాప్-20’ జాబితాలోకి చేరాడు. అతను 244 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.