క్రీడాభూమి

‘చెన్నై’ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 6: చెన్నై సూపర్ జెయింట్స్ సంబరాలు చేసుకుంటున్నది. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టడం అందుకు ఒక కారణమైతే, సూపర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రీటైన్ చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మరో కారణం. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు సభ్యులను తమ వద్దనే ఉంచుకోవచ్చనీ, వేలానికి పంపాల్సిన అవసరం లేదని ఐపీఎల్ పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో ధోనీకి చెన్నై తరఫున ఆడే అవకాశం దక్కింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌తోపాటు చెన్నైపైన కూడా రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. దీనితో గత రెండు ఐపీఎల్ పోటీల్లో ఈ రెండు జట్లు ఆడలేదు. వాటి స్థానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు తరపైకి వచ్చాయి. రెండేళ్ల సస్పెన్షన్ కాలం ముగియడంతో, చెన్నై, రాజస్థాన్ జట్లు తిరిగి ఐపీఎల్‌లో ఆడనున్నాయి. 2015లో ఈరెండు జట్ల తరఫున ఆడిన క్రికెటర్లకు తిరిగి అవే జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదన్న వాదన తొలుత వినిపించింది. అయితే, తమ వద్ద ఉన్న ఆటగాళ్లలో ఐదుగురిని రీటైన్ చేసుకోవచ్చని ఐపీఎల్ పాలక మండలి ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. చెన్నైలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ధోనీ తాజాగా కాంట్రాక్టుపై సంతకం కూడా చేశాడు. కుమార్తె జీవాను పక్కన ఉంచుకొని అతను ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కాగా, ధోనీ పునరాగమనం అధికారికంగా ఖరారు కావడంతో ‘చెన్నై’ ఫ్రాంచైజీకి గతంలో ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లతోపాటు, సపోర్టింగ్ స్ట్ఫా, అభిమానులు ఉత్సవాల్లో మునిగితేలుతున్నారు. రెండేళ్ల క్రితం ఆడిన చాలా మంది క్రికెటర్లు ఇప్పుడు వేలానికి వెళుతున్నప్పటికీ, తమకు అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉండడం విశేషం.