క్రీడాభూమి

విలియమ్‌సన్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 6: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అద్భుత సెంచరీతో రాణించడంతో, పాకిస్తాన్‌తో శనివారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌ను న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో, డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించి లక్ష్యాన్ని ఖరారు చేయాల్సి వచ్చిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 315 పరుగులు సాధించింది. విలియమ్‌సన్ 117 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. కొలిన్ మున్రో (58), హెన్రీ నికోల్స్ (50) అర్ధ శతకాలను నమోదు చేయగా, ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 48 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అమీర్, రుమ్మాన్ రయిస్, ఫహీం అష్రాఫ్, ఫఖర్ జమాన్ తలా ఒక్కో వికెట్ సాధించారు.
వర్షంతో అంతరాయం
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురవడంతో, పాకిస్తాన్ బ్యాటింగ్ కొంత ఆలస్యంగా మొదలైంది. దీనితో, డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఈ జట్టు లక్ష్యాన్ని 30.1 ఓవర్లలో 228 పరుగులుగా నిర్ణయించారు. అయితే, పరుగుల వేటలో తడబడిన పాకిస్తాన్ తనకు కేటాయించిన ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు చేజార్చుకొని 166 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 82 పరుగులు సాధించాడు. చివరిలో షాదాబ్ ఖాన్ (28), ఫహీం అష్రాఫ్ (17 నాటౌట్) వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టిమ్ సౌథీ 22 పరుగులకు మూడు, ట్రెంట్ బౌల్ట్ 35 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 315 (మార్టిన్ గుప్టిల్ 48, కొలిన్ మున్రో 58, కేన్ విలియమ్‌సన్ 115, హెన్రీ నికోల్స్ 50, హసన్ అలీ 3/61).
పాకిస్తాన్ ఇన్నింగ్స్ (లక్ష్యం 30.1 ఓవర్లలో 228 పరుగులు): 30.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 (్ఫఖర్ జమాన్ 82, షాదబ్ ఖాన్ 28, ఫహీం అష్రాఫ్ 17 నాటౌట్, టిమ్ సౌథీ 3/22, ట్రెంట్ బౌల్ట్ 2/35).

చిత్రం..సెంచరీతో కదం తొక్కి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్