క్రీడాభూమి

209 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు లో స్కోరింగ్ మ్యాచ్‌గా ముగిసే లక్షణాలు కనిపిస్తున్నాయ. మొదటి రోజు ఆటలో 13 వికెట్లు కూలితే, రెండో రోజున కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. మొత్తం 9 వికెట్లు పడ్డాయి
*
కేప్ టౌన్, జనవరి 6: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 209 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు కట్టడి చేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్, ఆ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో అద్భుత ప్రతిభ కనబరచిన రోహిత్ శర్మ కేవలం 11 పరుగుల స్కోరువద్ద కాగిసో రబదా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరగడంతో, రెండో రోజు ఆటలో వికెట్ల పతనం మొదలైంది. క్రీజ్‌లో నిలవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మెరుపు వేగంతో దూసుకొస్తున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల బంతులను సమర్థంగా ఆడలేకపోయిన చటేశ్వర్ పుజారా 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లో అతను వికెట్‌కీపర్ ఫఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ 12 పరుగులు చేసి, పుజారా తీరులోనే డు ప్లెసిస్ క్యాచ్ పట్టగా, ఫిలాండర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా 8 బంతులు ఎదుర్కొన్నప్పటికీ, పరుగుల ఖాతాను తెరవలేక, డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. 92 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకోవడానికి హార్దిక్ పాండ్య విశేషంగా శ్రమించగా, భువనేశ్వర్ కుమార్ అతనికి మద్దతుగా నిలిచాడు. అయితే, వీరి 99 పరుగుల భాగస్వామ్యానికి మోర్న్ మోర్కెల్ తెరదించాడు. 86 బంతులు ఎదుర్కొని 25 పరుగులు చేసి, డు ప్లెసిస్ క్యాచ్ అందుకోవడంతో భువీ పెవిలియన్ చేరాడు. తర్వాత కొద్ది సేపటికే హార్దిక్ పాండ్య వికెట్ కూడా కూలింది. వేగంగా పరుగులు రాబట్టిన అతను 95 బంతుల్లో 93 పరుగులు చేశాడు. కాగిసో రబదా బౌలింగ్‌లో, క్విండన్ డి కాక్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగిన హార్దిక్ స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా రెండు పరుగులు చేసి, కాగిసో రబదా బౌలింగ్‌లోనే డీన్ ఎల్గార్‌కు క్యాచ్ ఇవ్వడంతో, భారత్ మొదటి ఇన్నింగ్స్‌కు 73.4 ఓవర్లలో 209 పరుగుల వద్ద తెరపడింది. వెర్నన్ ఫిలాండర్ 33 పరుగులకు మూడు, కాగిసో రబదా 34 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్ చెరి రెండు వికెట్లు కూల్చారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. అయిడెన్ మర్‌క్రాన్ 34, డీన్ ఎల్గార్ 25 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లను హార్దిక్ పాండ్య సాధించాడు. హషీం ఆమ్లా (4 నాటౌట్), నైట్ వాచ్‌మన్ కాగిసో రబదా (2 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు.
*
దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాట్స్‌మెన్ పడిన కష్టాలకు
అద్దం పట్టే ఫొటో.. కాగిసో రబదా సంధించిన బౌన్సర్‌ను తప్పించుకోవడానికి
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చేసిన విన్యాసమిది. భారత తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉండగా, దురదృష్టవశాత్తు రబదా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.