క్రీడాభూమి

ఆక్లాండ్ ఓపెన్ విజేత జూలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, జనవరి 7: ఆక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను 29 ఏళ్ల జర్మనీ క్రీడాకారిణి జూలియా జార్జస్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని 6-4, 7-6 తేడాతో ఓడించింది. మొదటి సెట్ నుంచే వొజ్నియాకిపై విరుచుకుపడిన ఆమె, ఒకానొక దశలో గంటకు 180 కిలోమీటర్లు (112 మైళ్లు) వేగంతో బంతిని సర్వ్‌చేసి సత్తా చాటాంది. బలమైన సర్వీసులే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా, గత ఏడాది చివరిలో మాస్కో, జూహై డబ్ల్యుటీఏ టోర్నీలను సాధించిన జూలియాకు ఇది వరుసగా 14వ విజయం కావడం విశేషం.